Breaking News

రన్యారావును నిద్రపోనివ్వడం లేదు!

Published on Wed, 03/12/2025 - 13:34

బెంగళూరు: అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు.. బెయిల్‌ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ పేరుతో అధికారులు ఆమెను నిద్రపోవడం లేదని ఆమె తరఫు న్యాయవాది బుధవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

విచారణ పేరుతో నా క్లయింట్‌ రన్యారావును డీఆర్‌ఐ అధికారులు నిద్రపోనివ్వడం లేదు. అరెస్టైన సమయంలో తనకున్న హక్కుల గురించి ఆమెకు పూర్తిగా తెలియదని. హత్యా అభియోగాలు దాఖలైన కేసుల్లోనూ నిందితులు మహిళలైతే బెయిల్‌ లభించిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు నా క్లయింట్‌ కూడా బెయిల్‌​ పొందడానికి అర్హురాలే.  కాబట్టి ఆమెకు ఊరట ఇవ్వాలని వాదనలు వినిపించారాయన.

మార్చి 3వ తేదీన.. దుబాయ్‌ నుంచి విమానంలో అక్రమంగా బెంగళూరుకు బంగారాన్ని తెస్తూ కెంపగౌడ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు రన్యారావు దొరికిపోయారు. నడుము చుట్టూ, కాళ్ల కిందిభాగం, షూలో 14 కేజీల బంగారాన్ని దాచారు.  అయితే.. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

గత ఏడాది చివర్లో రెండుసార్లు దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేసిన ఆమె.. దానిని తీసుకొని తాను స్విట్జర్లాండ్‌ వెళ్తున్నానని అక్కడి కస్టమ్స్‌ అధికారులకు వెల్లడించినట్లు తేలింది. ఆమె ప్రయాణ వివరాలను పరిశీలిస్తే, ఆమె భారత్‌కు వచ్చినట్లు వెల్లడైందని డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తన అరెస్ట్‌ మెమోలో పేర్కొంది. 

అలాగే.. స్మగ్లింగ్‌ చేసే సమయంలో ఎయిర్‌పోర్టులో వీఐపీ ప్రొటోకాల్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విచారణ జరపాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కె.రామచంద్రరావు పేరును ఉపయోగించుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.  దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)