Breaking News

మాతో ఆటలొద్దు: కమల్‌హాసన్‌ వార్నింగ్‌

Published on Sat, 02/22/2025 - 09:24

చెన్నై:తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారని, ఈ విషయంలో తమతో ఆటలొద్దని ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎమ్‌) అధినేత కమల్‌హాసన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీ 8వ వ్యవస్థాపక దినం సందర్భంగా కమలహాసన్‌ మాట్లాడారు.

‘తమిళులకు భాష చాలా ముఖ్యమైనది. మాతో ఈ విషయంలో ఆలలొద్దు.భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం.మా పిల్లలకు కూడా ఏ భాష కావాలో తెలుసు.ఏ భాష కావాలో ఎంపిక చేసుకునే జ్ఞానం వారికి ఉంది’అని పరోక్షంగా కేంద్రం తీసుకువచ్చిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(ఎన్‌ఈపీ)ని ఉద్దేశించి కమల్‌ వ్యాఖ్యానించారు.

తమిళనాడులో రెండు భాషల విధానం అమలులో ఉండగా ఎన్‌ఈపీ కింద హిందీతో కలిపి మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిని అధికార డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఎన్‌ఈపీ అమలు చేయకపోతే తమిళనాడుకు రావాల్సిన రూ.2152 కోట్ల సమగ్రశిక్షాఅభియాన్‌ నిధులు నిలిపివేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ ఇప్పటికే హెచ్చరించారు. 

ప్రదాన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం స్టాలిన్‌ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఈ లేఖపై ప్రదాన్‌ తిరిగి స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు వదిలేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు.ఈ విషయమై తాజాగా ప్రధాని మోదీ కూడా పరోక్షంగా స్పందించారు. దేశంలో భాషల పట్ల శత్రుత్వం సృష్టించొద్దని కోరారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)