Breaking News

కమల యోధురాలు

Published on Wed, 11/06/2024 - 19:54

తిరువరూర్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ చేతిలో ఓటమిపాలైనప్పటికీ కమలా హారిస్‌ను పోరాట యోధురాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు తమిళనాడులోని ఆమె పూర్వికుల గ్రామ ప్రజలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, విజయం సాధిస్తారంటూ తులసేంద్రపురం గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండటంతో గ్రామస్తులు టీవీలకు అతుక్కుపోయారు. 

స్థానిక శ్రీ ధర్మ శాస్త పెరుమాల్‌ ఆలయంలో పూజలు చేసి, కమల గెలవాలని మొక్కుకున్నారు. మధ్యాహ్నానికల్లా ట్రంప్‌దే విజయమని, కమల ఓడిపోతున్నారని తేలడంతో నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం గ్రామానికి అమెరికా, బ్రిటన్‌ల నుంచి వచి్చన కమల అభిమానులు ముగ్గురు బుధవారం తిరిగి వెళ్లిపోయారు. ‘కమల గెలిస్తే దీపావళికి మించి ఘనంగా ఉత్సవం నిర్వహించాలని అనుకున్నాం. ఇందుకోసం, టపాసులు సిద్దంగా ఉంచాం. 

ఆలయంలో పూజలయ్యాక అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయాలనుకున్నాం’అని డీఎంకే తిరువరూర్‌ జిల్లా ప్రతినిధి, తులసేంద్రపురం గ్రామ నేత జె.సుధాకర్‌ చెప్పారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. ఆమె యోధురాలు, మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తారు’అని ధీమా వ్యక్తం చేశారు. 

ఇప్పుడామె అధ్యక్షురాలు కాకపోవచ్చు, భవిష్యత్తు ఏదో ఒకనాడు కమల అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడం ఖాయమంటూ మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కమల ఓటమిని తట్టుకోలేకపోతున్నాం. కానీ, ఆమెకిప్పుడు 60 ఏళ్లే. ఈ ఓటమితో నిరాశ చెందక ఇంతకుమించి పట్టుదలతో పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తారనుకుంటున్నాం’అని గ్రామానికి చెందిన టీఎస్‌ అన్బసరసు చెప్పారు. తమ గ్రామంలోని కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికా మొట్టమొదటి అధ్యక్షురాలవుతారని గ్రామస్తులంతా ఆశతో ఉన్నారని ఆయన అన్నారు. అధ్యక్షురాలైతే కమల తమ గ్రామానికి వస్తారని ఎదురుచూస్తామని చెప్పారు. 

చదవండి:  అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌.. స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ ప్రకటన

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)