Breaking News

జ్యోతి పోలీస్‌ కస్టడీ నాలుగు రోజులు పొడిగింపు

Published on Thu, 05/22/2025 - 12:44

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(YouTuber Jyoti Malhotra) పోలీసు కస్టడీని నాలుగు రోజులు పొడిగించారు. ఆమెను మే 17న హర్యానాలోని హిసార్‌లో అరెస్టు చేసి, ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. అది ఈరోజు(గురువారం)తో ముగిసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఆమె పోలీసు కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది.

ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేసిన పాకిస్తాన్ సిబ్బందితో ఆమెకు సంబంధాలునున్నాయనే ఆరోపణలతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) సమయంలో భారతదేశంలో విద్యుత్ సరఫరా నిలిపివేత(బ్లాక్‌ అవుట్‌) కు సంబంధించిన వివరాలతో పాటు పలు సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌తో పంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్‌తో టచ్‌లో ఉన్నట్లు బలమైన ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయని తెలుస్తోంది.

విచారణ అధికారులు జ్యోతి మల్హోత్రాకు చెందిన మూడు మొబైల్ ఫోన్‌లను, ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం స్వాధీనం చేసుకున్నారు. కాగా జ్యోతి.. పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్ మధ్య జరిగిన చాట్ రికార్డులు పోలీసులకు  లభ్యంకాలేదని అధికారులు తెలిపారు. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో జ్యోతి.. డానిష్‌తో సంప్రదింపులు జరిపారని  అధికారులు నిర్ధారించారు.  అలాగే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నానని యూట్యూబర్ జ్యోతి అధికారుల ముందు అంగీకరించారని తెలుస్తోంది. 2023లో జ్యోతి.. పాక్‌ సందర్శనకు వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్‌కు వెళ్ళినప్పుడు ఆమె డానిష్‌ను కలిశారని  అధికారుల విచారణలో వెల్లడయ్యింది.  

ఇది కూడా చదవండి: 103 అమృత్‌ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)