ఏంది సామీ ఈ రచ్చ!.. బీజేపీ ఎంపీ 'క్రేజ్' ఖండాంతరాలు దాటింది!

Published on Wed, 08/05/2026 - 20:21

లక్నో: అబ్బే ఇవ్వేం అయ్యే పనుల్లా కనిపించట్లేదే. పైగా.. ఫిజికల్‌గాను,మెంటల్‌గాను స్ట్రెయినూ,ఎవర్రా మీరంతా, నువ్వురా ఫ్రెండ్‌ అనే మీమ్‌ సోషల్‌ మీడియాలో కామన్‌ . కానీ ఇప్పుడు హెడ్‌క్వార్టర్స్‌ అనే సరికొత్త మీమ్‌ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది.    

మార్కెట్‌లోకి సరికొత్త ‘మీమ్‌ గాడ్‌' వచ్చేశారు! "నేను ఆడా ఉంటా.. ఈడా ఉంటా" అన్న రేంజ్‌లో సోషల్ మీడియా ప్రపంచాన్ని ఒంటిచేత్తో ఊపేస్తున్నారు. గల్లీ పాలిటిక్స్‌ నుంచి ఢిల్లీ పాలిటిక్స్‌ వరకు.. సినిమా స్క్రీన్ నుంచి ఇంటర్నేషనల్ ఫుట్‌ బాల్‌ గ్రౌండ్ వరకు.. ఎటు చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్సే వినబడుతున్నాయి.ఇంతకీ నెటిజన్లను ఇంతలా పిచ్చెక్కిస్తున్న ఆ 'యాక్సిడెంటల్‌ మీమ్‌ గాడ్‌' ఎవరో కాదు.. ప్రముఖ సినీ నటుడు, ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎంపీ రవి కిషన్‌. ఈ వైరల్ క్రేజ్‌పై ఆయన స్పందిస్తూ.. అయ్యో.. ఆ మహాదేవుడి మీద ఒట్టు, నేనెందుకు ఇంతలా వైరల్‌ అవుతానో నాకే తెలియదు’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

‘ది అలయన్స్’షో.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ సునామీ!
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల వచ్చిన  ది అలయన్స్ రియాలిటీ షోతోనే ఈ మీమ్స్ కథ మొదలైంది. రవి కిషన్ తన కుమార్తె రివా కిషన్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. అయితే, తన నియోజకవర్గంలో పనుల కారణంగా ఆయన ఈ షో నుంచి మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది.ఆ సమయంలో ఆయన సెలవు తీసుకుంటూ.. తనకు దేశ సేవ కోసం హెడ్‌క్వార్టర్స్ నుంచి పిలుపు వచ్చిందని, వెంటనే వెళ్లాలని చెప్పిన స్టైల్ మీమర్ల చేతికి చిక్కింది. దీనికి తోడు, అదే షోలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనబోయి పొరపాటున హోమ్ ఫ్రమ్ వర్క్ అని ఆయన అనడం ఇన్‌స్టాగ్రామ్‌ను ఊపేసింది. ఈ రెండు క్లిప్పింగులు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండ్ అయ్యాయి.

సరిహద్దులు దాటిన క్రేజ్.. రవి కిషన్ డైలాగ్స్‌కు ఫుట్‌బాల్ స్టార్స్ స్టెప్పులు!
రవి కిషన్‌కు లభించిన ఈ మీమ్ పాపులారిటీ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు.గ్లోబల్ లెవెల్‌కు రీచ్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఆడియో ఎంతలా వైరల్ అయిందంటే.. యూరప్‌లోని ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్బులు సైతం ఈ ట్రెండ్‌లోకి చేరాయి!.ఇటలీకి చెందిన ఐకానిక్ క్లబ్ జువెంటస్ జర్మనీకి చెందిన ప్రసిద్ధ క్లబ్ బోరుస్సియా డార్ట్‌మండ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో రవి కిషన్ డైలాగ్స్‌ను ఉపయోగించుకున్నాయి.

ఈ క్లబ్బులు తమ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ ప్రాక్టీస్ వీడియోలు, గోల్స్ కొట్టిన విజువల్స్‌కు రవి కిషన్ హెడ్‌క్వార్టర్స్,హోమ్ ఫ్రమ్ వర్క్ ఆడియోలను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎడిట్ చేసి పోస్ట్ చేశాయి. జువెంటస్ క్లబ్ ఒక అడుగు ముందుకేసి, రవి కిషన్‌కు సంబంధించిన మోస్ట్ పాపులర్ వైరల్ క్లిప్స్ అన్నింటినీ కలిపి ఒక క్రేజీ కంపైలేషన్ వీడియోను విడుదల చేసింది. ఒకే ఒక్క మీమ్ దేశీయ సెలబ్రిటీని గ్లోబల్ ఐకాన్‌గా ఎలా మార్చగలవో చెప్పడానికి ఈ హెడ్‌క్వార్టర్స్ ట్రెండే ఒక సూపర్ ఎగ్జాంపుల్!

 

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)