Breaking News

దివ్యాంగ చిన్నారులకు శాశ్వత సాయం

Published on Mon, 09/30/2024 - 05:51

న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారులకు జీవితకాలమంతా సాయం అందాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జువైనల్‌ జస్టిస్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. దివ్యాంగ చిన్నారుల హక్కుల పరిరక్షణపై 9వ వార్షిక జాతీయ సదస్సులో ఆదివారం ఆమె మాట్లాడారు. ‘‘ దేశంలో ఎంతమంది దివ్యాంగ చిన్నారులు అనే కచి్చతమైన గణాంకాలే లేకపోవడం దారుణం. దివ్యాంగ చిన్నారులందరికీ శాశ్వతంగా సహాయం, విద్య అందాలి. మనం చొరవ తీసుకుని వారిని పరిరక్షించలేకపోతే దివ్యాంగ చిన్నారులు నిరాదరణకు గురవుతారు. 

భిన్న ప్రాంతాల్లోని దివ్యాంగ చిన్నారుల సంక్షేమానికి విభిన్న పద్ధతుల్లో కృషి జరగాలి. అందరినీ ఒకే గాటినకడితే వారిపై వివక్ష చూపినట్లే లెక్క. ఇంతటి కీలక పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు అంగన్‌వాడీలకు తగు శిక్షణ ఇప్పించి, అక్కడి వనరులను పెంచాలి. నిర్బంధ విద్య అమలు అనే దానిని కేవలం కాగితాలకే పరిమితం చేయకూడదు. కచి్చతంగా దానిని అమలుచేయాలి. తద్వారా ప్రతి ఒక్క దివ్యాంగ విద్యారి్థకి విద్య అందించాలి’’ అన్నారు. దివ్యాంగ చిన్నారులకు పెన్షన్‌ శాశ్వతంగా అందేలా చూడాలని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్‌ మాలిక్‌కు న్యాయమూర్తి సూచించారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)