Breaking News

Bihar Elections: ‘20 నెలల్లో నం. వన్‌‌’: తేజస్వి యాదవ్

Published on Sun, 10/26/2025 - 11:00

పట్నా: నవంబర్‌లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)ప్రతిపక్ష మహాఘట్‌ బంధన్‌.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. తాజాగా పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్‌ను నంబర్‌ వన్‌ చేస్తామని పేర్కొన్నారు.

మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘మా ప్రచారం ప్రారంభమైంది. బీహార్ మార్పు కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. మేము ఎక్కడికి వెళ్లినా, అన్ని కులాలు, మతాల ప్రజలు మాకు మద్దతు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. దానిని మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. బీహార్ ప్రజల నుండి  మేము 20 నెలలు కోరుకుంటున్నాం. ఈ కాలంలో బీహార్‌ను నంబర్ వన్‌గా మార్చడానికి మేము కృషి చేస్తాం’ అని అన్నారు.

ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ పలు ప్రధాన ప్రకటనలు కూడా చేశారు. మూడు అంచెలుగా పంచాయతీ ప్రతినిధులు,  గ్రామ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చారు. వారికి పెన్షన్లు అందించాలని  కూడా నిర్ణయించామన్నారు. వారికి రూ. 50 లక్షల బీమా అందజేయనున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారుల గౌరవ వేతనాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తామని, క్వింటాలుకు మార్జిన్ మనీ పెంచుతామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉన్నవారికి కారుణ్య ఉపాధికి వర్తించే వయోపరిమితి కూడా పెంచుతామన్నారు. కుమ్మరి, కమ్మరి వడ్రంగి తదితర స్వయం ఉపాధి పనుల కోసం ఐదేళ్ల వ్యవధితో వడ్డీ లేని విధంగా రూ. 5 లక్షల రుణం అందిస్తామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. 

ఇది కూడా చదవండి: అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)