Breaking News

Air India Plane: ఒక్కసారిగా 900 అడుగుల కిందకు.. విచారణకు ఆదేశం!

Published on Tue, 07/01/2025 - 19:48

ఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన  ఘోర ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం అతి పెద్ద దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఇది యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరి వెళ్లే క్రమంలో సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 241 విమానంలో ఉన్నవారు చనిపోగా, ఈ దుర్ఘటన కారణంగా చనిపోయిన వారి సంఖ్య 275కు పెరిగింది.  ఇది జూన్‌ 12వ తేదీన జరిగిన ఘటన. 

అయితే ఆపై మరో రెండు రోజులకు ఒక పెను ప్రమాదం తప్పిందనే వార్త తాజాగా వెలుగుచూసింది. దీతాజాగా ఈ ఘటనపై  డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ విచారణకు ఆదేశించడంతో  పెను ప్రమాదం తప్పిందనే విషయం బయటకొచ్చింది. ఈ ఘటనను జాతీయ మీడియా హైలైట్‌ చేయడంతో వామ్మో మరో ఘోర ప్రమాదం తప్పిందని అనుకోవడం ప్రజల వంతైంది.

అసలు విషయంలోకి వెళ్లే..  జూన్‌ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నా బయల్దేరిన విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే పై నుంచి కిందకు దిగిపోయింది. ఉన్నపళంగా 900 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి పోవడంతో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి నియంత్రణలోకి తెచ్చారు. 

ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 777 AI-187 విమానం.. ఆ రోజు తెల్లవారుజామున మూడు  గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వియన్నాకు బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం 900 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో వార్నింగ్‌ సిగ్నల్‌ వెళ్లింది పైలట్లకు. 

ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  వెంటనే అప్రమత్తమైన విమాన పైలట్లు భద్రతాపరమైన చర్యలు చేపట్టడంతో విమానం మళ్లీ అదుపులోకి వచ్చింది. ఆపై దీన్ని సురక్షితంగా వియన్నా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ చేశారు. తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల్లో వియన్నాలో ఆ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

#

Tags : 1

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)