Breaking News

పుంజుకున్న నైరుతి.. 

Published on Thu, 07/09/2026 - 04:14

న్యూఢిల్లీ: జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా అంచనాలకు మించి భారీ వర్షాలు నమోదు కావడంతో ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజా వర్షాలతో లోటు కాస్తా 12 శాతానికి తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రుతుపవనాల పురోగతి, ఎల్‌–నినో పరిస్థితులపై ప్రధానమంత్రి ప్రధాన సలహాదారు పి.కె.మిశ్రా మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. 

వ్యవసాయ, తాగునీరు, పారిశుద్ధ్యం, వాణిజ్య వ్యవహారాలు, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ, జలవనరుల శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జూన్, జూలై నెలల్లో దేశవ్యాప్తంగా రుతుపవనాల పరిస్థితి, ప్రభావాల గురించి వివరించింది. 

గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రల్లో రుతుపవనాల రాక సాధారణం కంటే పది రోజులు ఆలస్యమైనప్పటికీ జూలై ఏడవ తేదీ వరకూ 30 శాతం వర్షం అధికంగా పడిందని, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అయితే.. ఎల్‌–నినో పరిస్థితులు అన్నిసార్లూ వార్షభావానికి కారణం కాదని స్పష్టం చేసింది. పరిస్థితిని నిత్యం గమనిస్తూ ఉన్నామని తెలిపింది.

ఖరీఫ్‌ సీజన్‌లో ఎల్‌ నినో పరిస్థితులను తట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసు కున్నారో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి వివరించారు. రాష్ట్రాలతోపాటు పంటలు, వాతావరణ శాఖలతో వారం వారం సమావేశాలు నిర్వహిస్తున్నామని, వర్షపా తం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, వ్యవ సాయ పనులు, మార్కెట్‌ ధోరణలు, పంటలను ఆశిస్తున్న చీడపీడల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలి పారు.

 సమస్యాత్మకం కాగల 262 జిల్లాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలను అందుబా టులో ఉంచామని చెప్పారు. ఎల్‌–నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రామాణిక పద్ధతులు కొన్నింటిని సిద్ధం చేసిందని వివరించారు. అనానుకూల వాతావరణాన్ని తట్టుకోగల విత్తన వెరైటీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 

పాడిపశువులకు దాణ లభ్యతను పరిశీలిస్తున్నామని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలపగా.. రిజర్వాయర్లు, భూగర్భ జలాల పరిస్థితిని నిత్యం గమనిస్తున్నామని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. వడగాడ్పుల వంటి పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలన్నదానిపై సూచనలను సిద్ధం చేశామని ఆరోగ్య శాఖ వివరించింది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, ఖరీఫ్, రబీ సీజన్లకు తగినన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని వాణిజ్య వ్యవహారాలు, ఎరువుల శాఖ తెలిపింది. వికసిత్‌ భారత్‌ పథకం కింద జూలై ఒకటవ తేదీ కింద చేపట్టిన పనులను గ్రామీణాభివృద్ధి శాఖ వివరించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)