Breaking News

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

Published on Tue, 03/19/2024 - 21:18

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. లిక్కర్‌ కుంభకోణానికి సంబంధించిన కేసులపై విచారణ జరుపుతున్న రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఇక నుంచి ఢిల్లీ లిక్కర్ కేసును కావేరి భావేజా విచారించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే ఢిల్లీ హయ్యర్‌ జ్యూడీషియల్‌ సర్వీసెస్‌కు చెందిన మరో 27 మంది న్యాయమూర్తులను(నాగ్‌పాల్‌తో సహా) ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. మరోవైపు ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్ (డీజేఎస్)కి చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.

కాగా జస్టిస్‌ నాగ్‌పాల్‌మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. నాగ్‌పాల్‌ ఇక నుంచి ఢిల్లీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిక్కర్‌ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. సిసోడియా, సింగ్‌ జ్యూడీషియల్‌ కస్టడీలో ఉండగా.. కవిత ఈడీ రిమాండ్‌లో ఉన్నారు.  
చదవండి: MLC Kavitha: మూడో రోజు ఈడీ విచారణ

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)