Breaking News

జడ్జి ఇంట నోట్ల కట్టల వివాదంలో కీలక మలుపు

Published on Tue, 08/12/2025 - 13:30

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నోట్ల కట్టల వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనపై మోపబడిన ఆరోపణలు వాస్తవమేనని, గౌరవ ప్రదంగా తప్పుకోకపోవడంతో ఆయన్ని తొలగించాల్సిందేనని ఇన్‌హౌజ్‌ కమిటీ ఇంతకు ముందు నివేదిక ఇచ్చింది. అయితే ఆయన్ని అభిశంసించాలన్న వ్యవహారంపై పార్లమెంట్‌లో ఓ అడుగు ముందుకు పడింది. 

ఇన్‌హౌజ్‌ కమిటీ నివేదిక ఇచ్చిన ప్రతిపాదనపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఇందులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, మద్రాస్‌ హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ మణిందర్‌ మోహన్‌, సీనియర్‌ అడ్వొకేట్‌ బీవీ ఆచార్య సభ్యులుగా ఉంటారని తెలిపారు. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను అభిశంసించాలన్న ప్రతిపాదనపై 146 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు స్పీకర్‌ వెల్లడించారు. కమిటీ వీలైనంత త్వరగా నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. 

వాట్‌ నెక్ట్స్‌.. 
పార్లమెంట్‌లో ఏర్పాటైన కమిటీకి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇస్తారు. అయితే ఈ కమిటీ ముందు తన వాదనలు వినిపించేందుకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు అవకాశం(మూడుసార్లు) ఉంటుంది. గతంలో త్రీజడ్జి కమిటీ సమర్పించిన నివేదికతో పాటు జస్టిస్‌ వర్మ వాదనలు, సాక్ష్యాలను పరిశీలించాకే స్పెషల్‌ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈపై ఇరు సభల్లో ఆ నివేదికపై చర్చ జరిగాక.. అభిశంసన తీర్మానాన్నిప్రవేశపెడతారు. దానిని  2/3 మెజారిటీతో సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతికి పంపిస్తారు. అప్పుడు ఆయన తొలగింపుపై రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు. 

అయితే ప్రస్తుతం పార్లమెంట్‌ సెషన్‌ 21వ తేదీతో ముగియనుంది. ఈ తరుణంలో ఆయన్ని తొలగించడం ఈ సెషన్‌లో సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)