Breaking News

జూబ్లీహిల్స్‌కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌

Published on Thu, 10/09/2025 - 04:25

సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్‌ శాసనసభ నియో జకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ తన అభ్య ర్థిగా నవీన్‌యాదవ్‌ పేరును ప్రకటించింది. కొద్దిరోజులుగా అనేక ఊహాగానాలు వినిపించినా చివరకు యువ నాయకుడు నవీన్‌ యాద వ్‌ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఉప ఎన్నిక అభ్యర్థిపై గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్రస్థాయిలో మంతనాలు జరి గాయి. 

పలువురు ఆశా వహులు ఢిల్లీ స్థాయిలో గట్టి లాబీయింగ్‌ నడిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం పలు సర్వేలు, స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. చివరకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో నవీన్‌ యాదవ్‌ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం ప్రకటన విడుదల చేశారు.

యువత, సామాజికవర్గం ఓట్లే లక్ష్యంగా..
నియోజకవర్గంలో యువ నాయకుడిగా, స్థాని కంగా మంచి పట్టున్న నేతగా నవీన్‌ యాదవ్‌కు పేరుంది. ఆయన తండ్రి బంజారాహిల్స్‌ కార్పొ రేటర్‌గా పనిచేయడం, నియోజకవర్గంలోని ఓటర్లతో తన కుటుంబానికి సత్సంబంధాలు ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశాలుగా పార్టీ అధిష్టానం భావించింది. 

యాదవ సామా జికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, యువతలో మంచి ఆదరణ ఉండటంతో గెలుపు అవకాశా లు మెరుగ్గా ఉంటాయని హైకమాండ్‌ అంచనా వేసింది. ఈ సమీకరణాలన్నింటినీ బేరీజు వేసు కున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నవంబర్‌ 11న జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ జరుగనుండగా, నవంబర్‌ 14న ఫలితాలు వెలువడనున్నాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)