Breaking News

జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి

Published on Sun, 12/10/2023 - 11:07

న్యూఢిల్లీ: అరవై ఏళ్ల వయసులో కూతురు హత్యకు గురైంది. 2008లో కూతురు చనిపోయిన తర్వాతి రోజు నుంచి ఆ తండ్రి దినచర్య పూర్తిగా మారిపోయింది. కూతురిని చంపిన వారికి శిక్ష పడేందుకు 15 ఏళ్లు ప్రతిరోజు ఆయన శ్రమించాడు.

ఎక్కడా అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ పట్టు వదలని విక్రమార్కునిలా తిరిగాడు. చివరకు ఈ ఏడాది నవంబర్‌ చివరిలో తన కూతురును చంపిన నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష పడేలా చేశాడు. విషాదమేంటంటే కూతురు 41వ జయంతికి ముందు రోజు శనివారం ఆ 82 ఏళ్ల తండ్రి కన్నుమూశాడు.

ఢిల్లీలోని ఓ న్యూస్‌ ఛానల్‌లో విధులు ముగించుకుని సొంత కారులో ఆలస్యంగా ఇంటికి వస్తున్న టీవీ జర్నలిస్టు సౌమ్యను 2008 సెప్టెంబర్‌ 30న నలుగురు దుండగులు  తుపాకీతో కాల్చి చంపారు.ఈ కేసు విచారణ 15 ఏళ్ల పాటు నడిచింది. రెండు వారాల క్రితమే కోర్టు నలుగురు నిందితులకు శిక్ష విధించింది.

నిందితులను దోషులుగా నిరూపించడం వెనుక సౌమ్య తండ్రి విశ్వనాథన్‌ తీవ్ర కృషి ఉంది. 15 ఏళ్ల పాటు రోజు పొద్దున్నే లేచి కూతురు హత్య కేసు ఫాలోఅప్‌ చేయడమే ఆయన పని. అయితే అనుకున్నది సాధించి కూతురును చంపిన వారికి శిక్ష వేయించిన తర్వాత కొద్ది రోజులకే ఆయన కన్ను మూయడం పలువురి హృదయాలను ద్రవింపజేస్తోంది.

ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్‌ హత్య కేసు : ఇద్దరు షూటర్ల అరెస్ట్‌

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)