Breaking News

రియాసి ఉగ్రవాది ఊహాచిత్రం విడుదల.. పట్టిస్తే 20లక్షల రివార్డ్‌

Published on Wed, 06/12/2024 - 09:14

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపిన ఉగ్రవాది స్కెచ్‌(ఫొటో)ను పోలీసులు విడుదల చేశారు. స్కెచ్‌ ఆధారంగా ఉగ్రవాది సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. రియాసి ఎస్పీ- 9205571332, రియాసి ఏఎస్పీ- 9419113159, ఎస్‌హెచ్‌ఓ పౌని- 7051003214 ఫోన్‌ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

రాస్నో-పౌని-త్రెయాత్‌ ప్రాంతాల్లో 11 భద్రతా బలగాల బృందాలతో ఉగ్రవాదులు వేట కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడి వెనకాల లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఉ‍న్నట్లు జమ్మూ కశ్మీర్‌ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి ఎన్‌ఐఏ ఫొరెన్సిక్‌ టీం ఆధారాలు సేకరిస్తోంది.

ఆదివారం 53 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు మృతి చెందగా.. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికుల బస్సు .. శివ్‌ కోరి నుంచి కాత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడ్డారు. బస్సులో ఉత్తరపదేశ్‌, రాజస్తాన్‌, ఢిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు. కాల్పులు జరగటంతో యాత్రికుల బస్సు లోయలోకి పడిపోయింది.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)