Breaking News

జార్ఖండ్‌: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. మరో అగ్రనేత మృతి

Published on Mon, 09/15/2025 - 09:24

హజరీబాగ్‌: జార్ఖండ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. హజరీబాగ్‌ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్ర నేత సహదేవ్‌ సోరెన్‌ సహా మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్‌ సోరెన్‌ తలపై రూ.కోటి రివార్డ్‌ ఉందని పోలీసులు తెలిపారు.

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మరో ఇద్దరు మావోయిస్టులు.. బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హేమ్రమ్ అలియాస్ చంచల్‌పై రూ. 25 లక్షలు, జోనల్ కమిటీ సభ్యుడు బీర్సెన్ గంఝు అలియాస్ రామ్‌ఖేలవాన్‌పై రూ.10 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, నిన్న (సెప్టెంబర్ 14) జార్ఖండ్‌లో మరో మావోయిస్టు మృతి చెందారు. పలాము జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు.

‘ఆపరేష్ కగార్’‌ మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గత కొన్ని నెలలుగా జార్ఖండ్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు ఆపరేషన్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు మావోయిస్ట్ సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

 

 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు