Breaking News

జేసీబీతో పప్పు కలిపేశారు! 

Published on Sat, 09/20/2025 - 06:33

న్యూఢిల్లీ: కాలువలు తవ్వడానికి, పాత ఇళ్లు కూల్చడానికే కాకుండా వంటలు వండడానికి, పప్పు కలపడానికి కూడా జేసీబీ ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఇక్కడ అచ్చంగా అదే చేశారు. భారీ పాత్రలో ఉడుకుతున్న పప్పును జేసీబీతో చక్కగా కలిపారు. అదే పప్పును అదే జేసీబీతో ట్రాక్టర్‌ ట్రాలీలోకి ఎత్తి, తర్వాత వేలాది మంది అతిథులకు వడ్డించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నీరాజాద్‌ అనే వ్యక్తి దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు గానీ క్షణాల్లోనే ఇంటర్నెట్‌లో పాకిపోయింది. 

జేసీబీనే మాస్టర్‌ చెఫ్‌గా మారిందని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి తిండి తింటే ఇంకేమైనా ఉందా? మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు. తిండి విషయంలో శుభ్రత గురించి కాస్తయినా పట్టించుకోండి అని సూచిస్తున్నారు. ఇదొక గొప్ప ఆవిష్కరణ అంటూ మరికొందరు జోక్‌ చేస్తున్నారు. ఇలా కూడా చేయొచ్చని మాకు ఇప్పటిదాకా తెలియదని అంటున్నారు. మట్టిని తవ్వడానికి వాడే యంత్రాన్ని వంటలు వండే ప్రదేశం దాకా తీసుకురావడమే పెద్ద తప్పు, అలాంటిది దాంతోనే పప్పు కలపడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. జేసీబీతో కలిపిన పప్పు భలే టేస్టు అంటూ సెటైర్లు సైతం విసురుతున్నారు. ఇకపై ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది ప్రభుత్వాన్ని కోరారు.  

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య