Breaking News

హోలీ రోజు జపాన్ యువతిని వేధించిన ఆకతాయిలు.. వీడియో వైరల్‌..

Published on Fri, 03/10/2023 - 21:13

న్యూఢిల్లీ: హోలీ పండుగ రోజు ఢిల్లీలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. విదేశీయురాలు అని కూడా చూడకుండా జపాన్ యువతిని వేధించారు. బలవంతంగా ఆమెకు రంగులు పూసి, కోడిగుడ్డును తలపై పగలగొట్టారు. ఆమె వద్దని చెబుతున్నా పట్టించుకోకుండా ఇబ్బందిపెట్టారు. వీరి తీరుతో ఆగ్రహించిన సదరు యువతి గ్యాంగ్‌లో ఒకడి చెంపచెళ్లుమనిపించింది. అనంతరం అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లిపోయింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులు సిగ్గపడే విధంగా ఈ ఆకతాయిలు ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపి కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు.

అయితే ఈ వీడియోను బాధితురాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వెంటనే డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కొందరు నెటిజన్లేమో ఇది పాత వీడియో అయి ఉండొచ్చని, మళ్లీ చక్కర్లు కొడుతోందని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా పోలీసులకు అందలేదు.

ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను చూసిన అనంతరం జపాన్ యువతి వివరాల కోసం ఎంబసీకి లేఖ రాశారు. అలాగే వీడియోలో అమ్మాయిని వేధించిన యువకుల వివరాలను సేకరించారు.
చదవండి: సీజనల్‌ ఇన్‌ఫ్లూయెంజాపై కేంద్రం కీలక ప్రకటన..

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)