Breaking News

జమ్ముకశ్మీర్‌లో నాల్గవరోజూ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్లకు గాయాలు

Published on Thu, 07/18/2024 - 10:04

జమ్ముకశ్మీర్‌లోని దోడాలో వరుసగా నాల్గవరోజు కూడా ఎన్‌కౌంటర్‌ జరిగింది. నేడు (గురువారం) తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.

కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన అనంతరం ఆర్మీ సిబ్బంది.. గ్రామంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. జూన్ 12 నుంచి దోడాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. చటర్‌గాలా పాస్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మరుసటి రోజు గండోలో కాల్పులు జరిగాయి. దానిలో ఒక పోలీసు గాయపడ్డాడు.

జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, జూలై 9న ఘరీ కుంకుమ అడవుల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూలోని ఆరు జిల్లాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మృతి చెందారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)