Breaking News

అణచివేత ఉన్నచోట జిహాద్‌ తప్పదు 

Published on Sun, 11/30/2025 - 04:55

న్యూఢిల్లీ: జమియత్‌ ఉలేమా–ఇ–హింద్‌ అధ్యక్షుడు మహమూద్‌ మదానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అణచివేత ఉన్నచోట జిహాద్‌ తప్పదని తేల్చిచెప్పారు. మైనార్టీల హక్కులను న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం నిరాకరిస్తున్నాయని ఆరోపించారు. బాబ్రీ మసీదు, ట్రిపుల్‌ తలాఖ్‌ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే న్యాయ వ్యవస్థ పనిచేస్తోందని విమర్శించారు. 

భారత రాజ్యాంగం మైనార్టీలకు ఇచ్చిన హక్కులను బహిరంగంగా ఉల్లంఘించేలా కోర్టు తీర్పులు ఉంటున్నాయని ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించినంత వరకే సుప్రీంకోర్టును ‘సుప్రీం’అని పిలవాలని తేల్చిచెప్పారు. అలా పరిరక్షించలేకపోతే ‘సుప్రీం’అని పిలిపించుకొనే అర్హత ఆ కోర్టుకు ఉండదని పేర్కొన్నారు. మదానీ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. భారత్‌లో ముస్లింల పట్ల ప్రజల వైఖరిని వెల్లడించారు. 

ముస్లింలకు దేశ జనాభాలో 10 శాతం మంది మద్దతిస్తున్నారని, 30 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని, 60 శాతం మంది నిశ్శబ్దంగా ఉండిపోతున్నారని చెప్పారు. ఇలా నిశ్శబ్దంగా ఉంటున్న 60 శాతం మందితో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. మన సమస్యలను వారికి వివరించాలని అన్నారు. ఒకవేళ ఆ 60 శాతం మంది ముస్లింలకు వ్యతిరేకంగా మారితే మాత్రం దేశంలో అతిపెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పారు.  

ఇతరులకు మంచి చేయడమే జిహాద్‌  
జిహాద్‌కు వక్రభాష్యాలు చెబుతున్నారని, తప్పుడు అర్థాలు తీసుకొస్తున్నారని మదానీ మండిపడ్డారు. ఇందులో మీడియాతోపాటు ప్రభుత్వం బాధ్యత ఉందని ధ్వజమెత్తారు. కుట్రలో భాగంగానే లవ్‌ జిహాద్, ల్యాండ్‌ జిహాద్, స్పిట్‌(ఉమ్మి) జిహాద్‌ను తెరపైకి తెచ్చారని విమర్శించారు. జిహాద్‌కు అసలైన అర్థం అది కాదని అన్నారు. జిహాద్‌ ఎప్పటికీ పరమ పవిత్రమైనదని వెల్లడించారు. 

ఇతరులకు మంచి చేయడం, వారి జీవితాలను మెరుగుపర్చడమే జిహాద్‌ అని వివరణ ఇచ్చారు. అణచివేత ఉన్నచోట జిహాద్‌ కచ్చితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మన దేశంలో రాజ్యాంగం ప్రకారం లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని గుర్తుచేశారు. ముస్లింలు రాజ్యాంగానికి విధేయులుగానే ఉంటున్నారని తెలిపారు. పౌరుల హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని ఉద్ఘాటించారు. 

ఆ పని ప్రభుత్వం చేయకపోతే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. జాతీయ గీతం వందేమాతరంపైనా మదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మృతప్రాయంగా మారిన ఓ సమూహం లొంగిపోయిందని అన్నారు. ఎవరైనా వందేమాతరం అని అంటే ఆ సమూహం ఆ గీతం పాడుతోందని ఆక్షేపించారు. తాము సజీవంగా ఉన్న సమూహమని, ఎలాంటి పరిణామాలైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తేల్చిచెప్పారు.  

కొత్త జిన్నాలు పుట్టుకొస్తున్నారు: బీజేపీ  
మహమూద్‌ మదానీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్‌ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ముస్లింలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని, రాజ్యాంగబద్ధమైన సంస్థలను సవాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కొత్త జిన్నాలు పుట్టుకొస్తున్నారని విమర్శించారు. మదానీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం మానుకోవాలని, ఇప్పటికైనా హద్దుల్లో ఉండాలని మదానీని హెచ్చరించారు. దేశంలో మదానీ లాంటి వ్యక్తులే ఉగ్రవాదులను, జిహాదీలను, రేపిస్టులను ఉత్పత్తి చేస్తున్నారని, లవ్‌ జిహాద్, ల్యాండ్‌ జిహాద్, ఉమ్మి జిహాద్‌కు మద్దతిస్తున్నారని రామేశ్వర్‌ శర్మ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసి, అమాయకులను హత్యచేస్తే శిక్షించకుండా బిర్యానీలు పెట్టి మర్యాదలు చేయాలా? అని ప్రశ్నించారు. ముస్లింల పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లయితే గౌరవిస్తామని అన్నారు. కానీ, డాక్టర్లుగా మారి బాంబులు విసిరితే అవే బాంబుల్లో కాలిపోతారని హెచ్చరించారు.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు