Breaking News

భారతీయులకు పీడ కలగా ట్రంప్‌ పాలన.. మరో 295 మంది వెనక్కి..

Published on Sat, 03/22/2025 - 07:49

న్యూఢిల్లీ: అక్రమ వలసదార్లపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వందలాది మందిని బలవంతంగా వారి స్వదేశాలకు తరలించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 300 మందికిపైగా భారతీయులను వెనక్కి పంపించింది. త్వరలో మరో 295 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం మన దేశానికి తరలించబోతోందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రకటన చేశారు.

ఇక, వీరంతా యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) కస్టడీలో ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు అనుమతి ఇచ్చిన వెంటనే వెనక్కి వచ్చేస్తారని చెప్పారు. 2025లో ఇప్పటిదాకా 388 మంది భారతీయులు అమెరికా నుంచి తిరిగివచ్చారని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పలువురు భారతీయులను సైనిక విమానాల్లో అమెరికా నుంచి వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.

అయితే, వారికి సంకెళ్లు వేయడం పట్ల భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మనవాళ్లను అవమానిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే, అక్రమ వలసదార్లను బయటకు వెళ్లగొట్టడం కొత్తేమీ కాదు. 2009 నుంచి ఇప్పటివరకు.. గత 16 ఏళ్లలో 15,700 మంది భారతీయ అక్రమ వలసదార్లను అమెరికా సర్కారు వెనక్కి పంపించింది. అయితే, సంకెళ్లు వేసే పద్ధతి 2012లోనే ప్రారంభమైంది. భారతీయులకు సంకెళ్లు వేసి పంపిస్తుండడం పట్ల తమ నిరసనను అమెరికా ప్రభుత్వానికి తెలియజేశామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్‌ సింగ్‌ శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)