Breaking News

వారణాసిలో గంగా హారతిలో పాల్గొన్న జీ20 ప్రతినిధులు..

Published on Mon, 06/12/2023 - 10:47

వారణాసిలో మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠంలో జూన్‌ 11 నుంచి 12 వరకు జీ20 గ్లోబల్‌ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, జీ20 ప్రతినిధులతో కలసి ఆదివారం వారణాసిలో జరిగే గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ మేరకు జీ20 ప్రతినిధులు వారణాసిలో దశాశ్వమేధ ఘాట్‌లో జరిగే గంగా హారతికి హాజరయ్యి సందడి చేశారు. ఆదివారం కాశీ విద్యాపీఠంలో జరగుతున్న 20 సదస్సుకు సుమారు 200 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు.

ఆదివారం ప్రారంభమైన ఈ సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట్లాడుతూ..45 ఏళ్ల కెరియర్‌లో ఫిజీ, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీని ఆహ్వానించిన విధంగా మరో ప్రధానిని స్వాగతించడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ జీ20 అభివృద్ధి మంత్రి వర్గ సమావేశం అభివృద్ధి చెందుతున్న దేశాల పురోగతిని అడ్డుకునే ఖరీదైన ట్రేడ్‌ ఆఫ్‌లను నివారించడం తోపాటు సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌(ఎస్‌డీజేస్‌) చేరుకునేలా అభివృద్ధి, పర్యావరణం, వాతావరణం ఎజెండాల మధ్య సమన్వయాలను సమిష్టిగా పెంపొందించేందుకు ఒక అవకాశంగా ఉంటుందని విదేశాంగ మంత్రి వెల్లడించారు.

జనవరిలో భారత్‌ ఆధ్వర్యంలో వాయిస్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌ సౌత్‌ సమ్మిట్‌ తదనంతరం వారణాసిలో జీ20 అభివృద్ధి మంత్రుల సమావేశం జరగడం గమనార్హం. ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు యూఎన్‌ శిఖరాగ్ర సమావేశంలోని సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌(ఎస్‌డీజీఎస్‌)కి దోహదం చేస్తాయని విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, ప్రపంచంలో పురాతన నగరాలలో ఒకటైన వారణాసిలోని గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను ప్రతినిధులకు తెలియజేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను, టూర్‌లను నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఈ జీ20 గ్లోబల్‌ సదస్సులో రెండ ప్రధాన సెషన్‌లు ఉంటాయి. ఒకటి బహుపాక్షికత(ఎస్డీ‌జీల దిశగా పురోగతిని వేగవంతం చేయడం), రెండు గ్రీన్‌ డెవలప్‌మెంట్‌(పర్వావరణ జీవన శైలి). 

(చదవండి: అవి 2జీ, 3జీ, 4జీ పార్టీలు: అమిత్‌ షా)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)