Breaking News

భారత్‌పై దాడికి జైష్ కుట్ర.. నిధుల సేకరణకు పిలుపు

Published on Wed, 11/19/2025 - 13:46

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) భారతదేశంపై మరో ఆత్మాహుతి (ఫిదాయీన్) దాడికి సిద్ధమవుతోంది. ఈ దాడి కోసం ప్రత్యేకంగా నిధులు సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు ‘ఎన్‌డీటీవీ’కి తెలిపాయి. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు దాడి దర్యాప్తులో ఈ విషయం వెలుగుచూసింది. జైష్ నేతలు ‘సదాపే’(పాకిస్తాన్‌ బ్యాంకింగ్ యాప్) లాంటి డిజిటల్ మార్గాల ద్వారా నిధులు సేకరణకు పిలుపునిచ్చారు.

జైష్ ఈ దాడుల కోసం మహిళల నేతృత్వంలో ఒక దళాన్ని కూడా సిద్ధం చేయనున్నదని తెలుస్తోంది. జైష్‌కు ఇప్పటికే మహిళా విభాగం ఉంది. ఉగ్ర సంస్థ నేత మసూద్ అజార్ సోదరి సాదియా ఈ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నారని సమాచారం. ఎర్రకోట దాడిలో కీలక నిందితురాలు డాక్టర్ షాహినా సయీద్ అలియాస్ 'మేడమ్ సర్జన్' కూడా ఈ యూనిట్‌లో సభ్యురాలిగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ‘జిహాదీ’ ఆత్మాహుతి దళం కోసం జైష్ 20 వేల పాకిస్తానీ రూపాయలు (సుమారు రూ.6,400) చొప్పున విరాళాలు డిమాండ్ చేస్తోంది. ఈ డబ్బును ‘ముజాహిద్‌) (పోరాట యోధుడు) కోసం శీతాకాలపు కిట్‌ను కొనడానికి ఉపయోగిస్తారు. ఇందులో బూట్లు, సాక్స్, పరుపు, టెంట్  మొదలైనవి ఉంటాయి.

జైష్, లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఈటీ) వంటి ప్రధాన ఉగ్రవాద గ్రూపులు సమన్వయంతో కొత్త దాడులకు సిద్ధమవుతున్నాయని తాజా నిఘా సమాచారం సూచిస్తున్నది. ఈ రెండు సంస్థలకు పాకిస్తాన్ సైన్యం, డీప్ స్టేట్ నుండి నిధులు, మద్దతు లభిస్తున్నాయి. ఈ డిజిటల్ నిధుల నెట్‌వర్క్‌పై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక విచారణ ప్రారంభించాయి. కాగా ఎర్రకోట కారు బాంబు దాడి నవంబర్ 10న జరిగింది. ఈ చారిత్రక కట్టడం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 పేలింది. ఈ పేలుడులో15 మంది మృతి చెందారు. కారు నడిపిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ కూడా మృతిచెందాడు.

ఇది కూడా చదవండి: ‘ముస్లింలు, క్రైస్తవులు.. అంతా హిందువులే’: మోహన్ భగవత్

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు