Breaking News

ట్రక్‌ బీభత్సం..19 మంది మృతి

Published on Mon, 11/03/2025 - 15:10

జైపూర్‌:రాజస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ప్రయాణిస్తున్న వాహనాలపై డంపర్‌ ట్రక్‌ దూసుకెళ్లింది. ఐదుకిలోమీటర్ల మేర వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మందికి పైగా మృతి చెందారు. యాబై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 17కు పైగా వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.   

జైపూర్ నగరంలోని హర్మదా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ డంపర్ ట్రక్‌ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన డంపర్ ట్రక్‌ ముందుగా ఓ కారును ఢీకొట్టింది. ఆ తర్వాత పల్టీ కొడుతూ మరో రెండు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కార్లు, బైకులు, పాదచారులు అన్నీ డంపర్‌ ట్రక్‌ కిందపడి నుజ్జునుజ్జయ్యాయి. అయినప్పటికీ ట్రక్‌ డ్రైవర్‌ వాహనం ఆపకుండా ముందుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

మద్యం మత్తులో డంపర్‌ డ్రైవర్‌?
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.  ప్రమాద సమయంలో డంపర్‌ డ్రైవర్‌ మద్యం సేవించినట్లు సమాచారం. ఐదు కిలోమీటర్ల మేర అతను వాహనాలను ఢీకొంటూ ముందుకు సాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘డంపర్‌ ట్రక్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడు. రోడ్డుమీద వాహనాల్ని ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. వాహనాలు ప్రమాదానికి గురవుతున్నా ఆపకుండా ముందుకు వెళ్లాడని ’ వారు పేర్కొన్నారు.

పోలీసుల దర్యాప్తు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డంపర్‌ డ్రైవర్‌ మద్యం సేవించాడా? లేక వాహనంలో బ్రేక్‌ ఫెయిల్యూర్‌ జరిగిందా? అనే కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

Jaipur Road Accident: 10 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు