Breaking News

87 ఏళ్ల క్రితం ‘జై భీమ్‌’ పుట్టిందిలా..

Published on Sat, 12/06/2025 - 12:42

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ వర్థంతి నేడు(డిసెంబర్‌ 6). 1956లో ఇదే రోజున ఆ మహనీయుడు కన్నుమూసినప్పటికీ, ఆయన స్ఫూర్తిని గుర్తుకు తెచ్చే ‘జై భీమ్‌’ నినాదం నేటికీ ఆయన వారసత్వాన్ని, దళితుల ఐక్యతను చాటుతోంది. డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్‌పై గల అపారమైన గౌరవాన్ని, దళిత సమాజపు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన నినాదం ‘జై భీమ్’ ఆవిర్భావం వెనుక  ఆసక్తికర కథనం ఉంది.  

సుమారు 87 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని నాటి ఔరంగాబాద్ (నేటి ఛత్రపతి శంభాజీనగర్) జిల్లా, కన్నద్ తెహ్సిల్‌లోని మక్రాన్‌పూర్ గ్రామంలో చారిత్రక తొలి పరిషత్ సమావేశం జరిగింది. మరాఠ్వాడ షెడ్యూల్డ్ కులాల సమాఖ్య మొదటి అధ్యక్షుడు భౌసాహెబ్ మోర్, డిసెంబర్ 30, 1938న ఈ మొదటి మక్రాన్‌పూర్ పరిషత్‌ను నిర్వహించారు. ఈ చారిత్రక సందర్భాన్ని గురించి భౌసాహెబ్ మోర్ కుమారుడు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ మోర్ వివరించారు. నాటి సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ పాల్గొని, ఆనాటి హైదరాబాద్ రాచరికపు రాష్ట్రానికి మద్దతు ఇవ్వవద్దని ప్రజలను కోరారు.  

అనంతరం భౌసాహెబ్ మోర్ మాట్లాడుతూ ప్రతి సమాజానికి ఒక ఆరాధ్య దైవం ఉంటాడని, ఆ పేరుతో వారు పలకరించుకుంటారని పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ మనకు పురోగతి మార్గాన్ని చూపించారని, ఆయన మనకు దేవుడిలాంటివారని, కాబట్టి ఇక నుండి మనం ఒకరినొకరు కలిసేటప్పుడు ‘జై భీమ్’ అని పలుకరించుకోవాలని పిలుపునిచ్చారు. పరిషత్‌కు హాజరైన జనం ఈ కొత్త నినాదంపై ఉత్సాహంగా స్పందించి, వెంటనే ఆ నినాదాన్ని తమ సమాజ నినాదంగా అంగీకరిస్తూ, ఈ తీర్మానాన్ని ఆమోదించారు.  

మక్రాన్‌పూర్ వేదిక ఎంపిక వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. నాటి నిజాం పాలకులు దళితులపై మతమార్పిడి ఒత్తిళ్లతో సహా పలు దురాగతాలకు పాల్పడేవారు. వీటిని భౌసాహెబ్ మోర్..  డాక్టర్ అంబేద్కర్ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అయితే రాచరిక రాష్ట్రాలను వ్యతిరేకించిన కారణంగా హైదరాబాద్ రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ ప్రసంగాలు ఇవ్వకుండా నిషేధించారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ భూభాగంలో ఉన్న మక్రాన్‌పూర్ గ్రామాన్ని సమావేశ వేదికగా ఎంచుకున్నారు. అంబేద్కర్ అనుచరులు నిజాం పోలీసుల నుండి తప్పించుకుని ఈ సభకు హాజరయ్యారు.

మొదటి మక్రాన్‌పూర్ పరిషత్ కోసం భౌసాహెబ్ మోర్ కుటుంబం ఎంతో త్యాగం చేసింది. ఖర్చుల నిర్వహణ కోసం మోర్ తన అమ్మమ్మ నగలను తాకట్టు పెట్టారు. ఖాందేశ్, విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చారు. డాక్టర్‌ అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశాన్ని ప్రతి  ఏటా డిసెంబర్ 30న నిర్వహిస్తారు. 1972లో మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొన్నప్పుడు కూడా ఈ సంప్రదాయం  కొనసాగడం విశేషం.

ఇది  కూడా చదవండి: అయోధ్యలో హై అలర్ట్.. మసీదు కూల్చివేతకు 33 ఏళ్లు..

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)