Breaking News

ఆ తీర్పు న్యాయ చరిత్రలోనే మాయనిమచ్చ

Published on Sat, 06/21/2025 - 05:07

న్యూఢిల్లీ: యాభై ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నకాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన తీర్పు ప్రపంచ న్యాయచరిత్రలోనే మాయనిమచ్చ అని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అభివర్ణించారు. దేశంలో అత్యయిక స్థితి విధించి ఈనెల 25వ తేదీతో 50 ఏళ్లుపూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 25వ తేదీని ‘సంవిధాన్‌ హత్యా దివస్‌’గా జరుపునున్న నేపథ్యంలో ధన్‌ఖడ్‌ ఈ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. 

ఎమర్జెన్సీకాలంలో ప్రాథమిక హక్కులు ఉండవంటూ ఆనాడు తీరి్పచ్చిన సుప్రీంకోర్టును ధన్‌ఖడ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం ఢిల్లీలో రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులనుద్దేశించి ధన్‌ఖడ్‌ ప్రసంగించారు.

 ఈ వివరాలను ఉపరాష్ట్రపతి కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘మంత్రిమండలి అభిప్రాయాలకు వీసమెత్తయినా విలువ ఇవ్వకుండా నాటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నాటి రాష్ట్రపతి ఫక్రుదీద్‌న్‌ అలీ అహ్మద్‌ ఆమోదముద్ర వేశారు. 

కేవలం ప్రధాని హోదాలో ఉన్న ఒక్కరి సలహాకు రాష్ట్రపతి ఆమోదం తెలపకూడదు. రాజ్యాంగంలో దీనిపై ఎన్నెన్నో నిబంధనలున్నాయి. ప్రధాని సారథ్యంలోని మంత్రులు రాష్ట్రపతికి సలహాలు, సూచనలు చేయొచ్చు. కానీ ఇవేం పట్టించుకోకుండా ఇందిరా గాంధీ సిఫార్సుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీని విపరిణామాలను వెంటనే దేశం చవిచూసింది. ఆనాడు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షకుపైగా పౌరులను ప్రభుత్వం కటకటాల వెనక్కు నెట్టింది’’అని ధన్‌ఖడ్‌ గుర్తుచేశారు.

న్యాయస్థానం పాత్ర దారుణం
 ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు అమలుకాకుండా ప్ర భుత్వం అడ్డుకుంది. అలాంటప్పుడు జ నం న్యాయం కోసం న్యాయస్థానాల వైపు చూస్తారు. పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా తొమ్మిది హైకోర్టులు ఎమర్జెన్సీ విధించినా, విధించకపోయినా ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయని చరిత్రాత్మక తీ ర్పులు ఇచ్చాయి. కానీ ఆ తీర్పులను కొట్టే స్తూ సుప్రీంకోర్టు అత్యంత ప్రజాస్వామికవ్యతిరేక తీర్పును వెలువర్చింది. ఇది నిజ ంగా ప్రపంచం న్యాయచరిత్రలోనే చీకటిపేజీ. ఎమర్జెన్సీ అమల్లో ఉంటే పౌరులకు ప్రాథమిక హక్కులు ఉండబోమని సుప్రీంకోర్టు తెలిపింది. 

సుప్రీంకోర్టు తీర్పుతో నియంతృత్వం, అధికారవాదం దేశంలో తిష్టవేశాయి. కోర్టుల్లో న్యాయం దక్కుతుందని భావిస్తున్న ప్రపంచం ఈ తీర్పుతో దిగ్భ్రాంతికి గురైంది. ఎంతకాలం ఎమర్జెన్సీ కొనసాగాలో అంతకాలం అది అమల్లోఉండేలా పాలకులు ఆశించిందే చివరకు జరిగింది’’అని ధన్‌ఖడ్‌ అన్నారు. ఈ పరిణామాల దృష్ట్యానే నేటి ప్రభుత్వం జూన్‌ 25వ తేదీని ‘సంవిధాన్‌ హత్యా దివస్‌’గా జరపాలని సముచితంగా నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో 1975 జూన్‌ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీదాకా ఎమర్జెన్సీ అమల్లో ఉంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)