Breaking News

16 నుంచి జగన్నాథ రథయాత్ర.. 10 ఆసక్తికర విషయాలు!

Published on Wed, 07/15/2026 - 10:09

పూరీ: ఒడిశాలోని పూరీ క్షేత్రంలో  అత్యంత వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రకు  సన్నాహాలు పూర్తయ్యాయి. జూలై 16, గురువారం నుంచి జూలై 24, శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రథయాత్రకు సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాలు..

1.ప్రారంభం: ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం, శుక్ల పక్షం ద్వితీయ తిథిన పూరీ జగన్నాథ ఆలయం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది.

2.దారు తయారీ: రథాల నిర్మాణానికి ఎంపిక చేసిన వేప చెట్లను ‘దారు’ అని పిలుస్తారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, శుభప్రదమైన చెట్లను ఎంపిక చేస్తారు.

3.రథాల పేర్లు: జగన్నాథుని రథాన్ని ‘నందిఘోష’ (గరుడధ్వజ) అని, బలరాముని రథాన్ని ‘తలధ్వజ’ అని, సుభద్ర దేవి రథాన్ని ‘దర్పదాలన్’ (పద్మ రథం) అని పిలుస్తారు.

4.నిర్మాణ విశేషం: వసంత పంచమి రోజున కలప ఎంపిక మొదలై, అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణం ప్రారంభమవుతుంది. రథాల తయారీలో మేకులు, ఇతర పదునైన లోహ వస్తువులను ఉపయోగించకపోవడం విశేషం.

5.హేరా పంచమి: రథయాత్ర ఐదో రోజైన ‘హేరా పంచమి’ నాడు, స్వామిని విడిచి వెళ్లారన్న ఆగ్రహంతో అమ్మవారు లక్ష్మీదేవి గుండిచా ఆలయానికి వచ్చి నందిఘోష రథ చక్రం వద్ద సంకేతక ఉత్సవాన్ని జరుపుతారు.

6.బహుడ యాత్ర: స్వామి తన అత్తగారి ఇల్లు అయిన గుండిచా ఆలయంలో వారం రోజుల పాటు బస చేసి, ఆషాఢ శుక్ల దశమి తిథిన తిరుగు ప్రయాణం అవుతారు. దీనినే ‘బహుడ యాత్ర’ అంటారు.

7. నీలాద్రి విజయం: తిరిగి ఆలయానికి చేరుకున్న స్వామిని, అమ్మవారిని  గర్భాలయంలోకి ప్రవేశించే ప్రక్రియను ‘నీలాద్రి విజయం’ అని పిలుస్తారు.

8. ముస్లిం భక్త సాల్‌బేగ్: రథయాత్ర సాగే మార్గంలో సాల్‌బేగ్ అనే ముస్లిం భక్తుడి సమాధి వద్ద కూడా రథం ఆగుతుంది. ఆయన తల్లి హిందువు, తండ్రి ముఘల్ సైనికుడు.

9.రథం ప్రయాణం: పూరీ జగన్నాథాలయం నుంచి గుండిచా ఆలయం వరకు రథం దాదాపు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు ఈ దూరాన్ని చేరుకోవడానికి రోజంతా పడుతుంది.

10.పాప విముక్తి: రథపు తాళ్లను లాగడం ద్వారా భక్తులు తమ పాపాలు తొలగిపోతాయని, శ్రీహరిలోకంలో స్థానం పొందుతారని నమ్ముతారు.

ఇది కూడా చదవండి: షాకిస్తున్న ఐటీ ఉద్యోగి క్యాబ్ డ్రైవింగ్ స్టోరీ!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)