Breaking News

అనంత్‌ అంబానీ మరో లగ్జరీ వాచ్‌, అదిరిపోయే డిజైన్‌, ధర ఎంత?

Published on Thu, 01/22/2026 - 16:03

దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ వారసుడు, వ్యాపారవేత్త అనంత్‌ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అటు వ్యాపారంతోపాటు, వన్య ప్రాణుల సంరక్షణ కోసం ‘వంతార’ ఏర్పాటు చేసి మరింత ఆకర్షణీయమైన వ్యక్తిగా నిలిచాడు. తాజాగా అనంత్‌ అంబానీ, వంతారాకు సంబంధించి మరో  అంశం విశేషంగా నిలుస్తోంది.

న్యూయార్క్‌కు చెందిన లగ్జరీ జాకబ్ & కో అనంత్ అంబానీ కోసం కస్టమ్ 'వంతారా' గడియారాన్ని రూపొందించింది. ఈ హోరోలాజికల్ మాస్టర్‌పీస్‌ 'ఒపెరా వంటారా గ్రీన్ కామో' ను జనవరి 21న ఆవిష్కరించింది. అనంత్ అంబానీకి ఇష్టమైన వంతారాకు నివాళిగా ఈవాచ్‌ను తయారు చేసింది. డెమాంటాయిడ్ గోమేదికాలు, సావోరైట్‌లు, ఆకుపచ్చ నీలమణి , తెల్ల వజ్రాలు  ఇందులో ఉన్నాయి. 21.98 క్యారెట్లతో దాదాపు 400 విలువైన రాళ్ల సంక్లిష్టమైన అమరిక అని, జాకబ్ అండ్ కో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ టైమ్‌పీస్ విలువ దాదాపు ‘1.5 మిలియన్లు’ (సుమారు రూ.12.5 కోట్లు). ప్రస్తుతం ఇది హోరాలజీ ప్రియులతోపాటు, ఫ్యాషన్‌ ప్రియుల ప్రశంసలందుకుంటోంది. (నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు)

'ది వంతారా'లో 397 రత్నాలు
ఈ వాచ్‌ డిజైన్‌ మరింత  స్పెషల్‌గా నిలుస్తోంది. డయల్‌లో మధ్యలో చేతితో తయారుచేసిన అనంత్‌ అంబానీ బొమ్మ అమర్చారు. అలాగే  చుట్టూ బెంగాల్‌ టైగర్‌, సింహాన్నిఅమర్చారు. అలాగే  బంగారం రూపొందించిన వంతారా,  ఎనుగు ఈ డయల్‌లో మరో ఆకర్షణ. అనంత్ అంబానీ లగ్జరీ వాచెస్‌ అంటే చాలా ఇష్టం. దీనికి సంబంధించినాయన దగ్గర పెద్ద కలెక్షనే ఉంది. తాజాగా ప్రపంచంలోనే ఉత్తమమైన జాకబ్‌ బ్రాండ్‌ది కూడా  చేరింది. అనంత్ అంబానీ గడియారాల్లో పటేక్ ఫిలిప్, ఆడెమర్స్ పిగ్యుట్, రిచర్డ్ మిల్లె, రోలెక్స్ నుండి చాలా అందమైన విలాసవంతైన టైమ్‌పీస్‌లు చోటు దక్కించుకున్నాయి.  వీటి మొత్తం విలువ రూ. 200 కోట్లకు పైమాటేనని అంచనా.  

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)