Breaking News

7 కోట్ల రుద్రాక్షలతో... ద్వాదశ జ్యోతిర్లింగాలు 

Published on Sun, 01/19/2025 - 04:58

మహాకుంభ్‌నగర్‌/లఖ్నో: ఇసుకేస్తే రాలని భక్తజన సందోహం నడుమ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కన్నులపండువగా కొనసాగుతోంది. వేడుకకు వేదికైన త్రివేణి సంగమానికి ప్రపంచం నలుమూలల నుంచీ భక్తులు వెల్లువెత్తుతూనే ఉన్నారు. శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మేళాలో పాల్గొన్నారు. వీఐపీ ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. 

అనంతరం అక్షయ వటవృక్షం, పాతాళ్‌పురీ మందిర్, సరస్వతీ కూప్‌ను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బడే హనుమాన్‌ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఇంతటి వేడుకలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. ‘‘మహా కుంభమేళా ఏ మతానికో, ప్రాంతానికో చెందినది కాదు. భారతీయతను ప్రతిబింబించే అతి పెద్ద సాంస్కృతిక పండుగ. భారత్‌ను, భారతీయతను అర్థం చేసుకునేందుకు చక్కని మార్గం’’అని అభిప్రాయపడ్డారు.

 మహా కుంభమేళాలో పలు విశేషాలు భక్తులకు కనువిందు చేస్తున్నా యి. మహాకుంభ్‌నగర్‌ సెక్టర్‌ 6లో ఏకంగా 7.51 కోట్ల రుద్రాక్షలతో రూపొందించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో లింగాన్ని 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడ ల్పు, 7 అడుగుల మందంతో రూపొందించారు. 

వాటి తయారీలో వాడిన రుద్రాక్షలను 10 వేల పై చిలుకు గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ సేకరించినట్టు నిర్వాహకుడు మౌనీ బాబా తెలిపారు. వాటిలో ఏకముఖి నుంచి 26 ముఖాల రుద్రాక్షల దాకా ఉన్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం 22న ప్రయాగ్‌రాజ్‌లో సమావేశం కానున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌ అభివృద్ధికి సంబంధించి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతకుముందు యోగి కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించనున్నారు.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)