Breaking News

ఇస్రో సేవలు అద్భుతం

Published on Fri, 09/22/2023 - 05:02

సాక్షి, న్యూఢిల్లీ: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇస్రో అద్భుతమైన సేవలందిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్‌రామ్‌ కొనియాడారు. అంతరిక్ష రంగంలో మహిళల ప్రమేయం పెరిగేలా ప్రోత్సహించాల ని కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో గురువారం చంద్రయాన్‌–3 విజయంపై జరిగిన చర్చలో ఎంపీలు ఇరువురూ మాట్లాడారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప పరిశోధనలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జరగటం తెలుగువారికి గర్వకారణమన్నారు.

చంద్రయాన్‌ ప్రయోగంలో భాగస్వాములైన మెజారిటీ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి రావ డం గొప్ప విషయమని చెప్పారు. యూనివర్సిటీలకు రాష్ట్రీయ  య ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌(రూసా)కింద గత నాలుగైదు సంవత్సరాలుగా ఏటా రూ.8,120 కోట్ల నిధులు కేటాయిస్తున్నా వినియోగం 60 శాతం కూడా ఉండటంలేదని వివరించారు. వర్సిటీలు ఈ నిధులు వాడుకునేలా వెసులుబాటు కల్పించాల్సి ఉందన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని మెరుగుపరచాల్సిఉందని సూచించారు.   

ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ.. అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడా రు. దేశమంతా చంద్రయాన్‌–3 విజయాన్ని కొనియాడుతుంటే టీడీపీ మాత్రం మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతోందని ఎద్దే వా చేశారు. రూ.3,300 కోట్ల కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారన్నారు. చంద్రబాబు చేసిన ఇతర కుంభకోణాలు సైతం త్వరలో బయటపడతాయన్నారు.

చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్‌ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్‌ ల్యాండయినప్పుడు తన ఆరేళ్ల కుమార్తె ‘నాన్నా చంద్రుడి మీద అడుగుపెట్టాం’ అంటూ ఎంతో సంబరపడిందని,  ‘మనం ఎప్పుడు చంద్రుడి మీద కు వెళ్తాం అమ్మా?’ అని తన తల్లిని అడగడం తనని ఎంతో సంతోషానికి గురిచేసిందన్నారు. చంద్రయాన్‌–3 విజయంపై ఇస్రో బృందం, ప్రధాని నరేంద్రమోదీకి భరత్‌ కృతజ్ఞతలు తెలిపారు.     

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)