Breaking News

ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి మృతి.. తొలి మహిళగా ఆమె పేరిట రికార్డు..

Published on Mon, 09/04/2023 - 16:29

బెంగళూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో).. ఇప్పుడు ఎక్కడా విన్నా ఇస్రో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇస్రో ప్రాజెక్ట్‌ లాంచింగ్‌ సందర్భంగా కౌంట్‌డౌన్‌ చదువుతూ ఒక మహిళ గొంతు వినపడుతుంది. కాగా, ఆ స్వరం మూగబోయింది. ఇస్రో ప్రతీ ప్రాజెక్ట్‌లో కౌంట్‌డౌన్‌ వినిపించే గొంతు ఇక మళ్లీ వినపడదు. కౌంట్‌డౌన్‌ చదివే ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి తుదిశ్వాస విడిచారు. 

వివరాల ప్రకారం.. వరుస విజయాలతో ఎంతో ఆనందంతో ఉన్న ఇస్రో శాస్త్రవేతల బృందంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇస్రో ప్రయోగాలకు కౌంట్‌డౌన్‌ వాయిస్‌ అందించే శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూశారు. గుండెపోడుతో వలర్మతి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె మృతి పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. 

శాస్త్రవేత్తల సంతాపం..
అయితే, శాస్త్రవేత్త వలర్మతి.. చంద్రయాన్​-3 లాంచ్​ సమయంలోనూ ఆమెనే స్వరాన్ని అందించారు. అదే ఆమె వాయిన్‌ వినిపించిన చివరి మిషన్​. ఇస్రోలో ఆమెను వలర్మతి మేడం అని పిలుస్తారు.  వలర్మతి మరణం నేపథ్యంలో ప్రముఖులు, ఇస్రో శాస్త్రవేత్తలు సోషల్‌ మీడియా ద్వారా సంతాపాన్ని తెలుపుతున్నారు. కాగా, వలర్మతి మృతిపై ఇస్రో మాజీ డైరెక్టర్‌ పీవీ వెంకటకృష్ణన్‌ స్పందించారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. భవిష్యత్తులో శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టి ప్రాజెక్ట్స్​ కౌంట్‌డౌన్‌ల​లో వలర్మతి మేడం గొంతు వినిపించదు. చంద్రయాన్​-3నే ఆమె చివరి కౌంట్‌డౌన్​. ఆమెది ఆకస్మిక మరణం. బాధగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. 

అబ్దుల్‌ కలాం అవార్డు పొందిన తొలి మహిళ..
శాస్త్రవేత్త వలర్మతి.. తమిళనాడులోని ఆరియలూర్​లో 1959 జులై 31న జన్మించారు. కోయంబత్తూర్​లోని గవర్నమెంట్​ కాలేజ్​ ఆఫ్​ టెక్నాలజీలో ఇంజినీరింగ్​ చదివారు. 1984లో ఇస్రోలో శాస్త్రవేత్తగా జాయిన్‌ అయ్యారు. ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. తొలి దేశీయ రాడార్​ ఇమేజింగ్​ సాటిలైట్​ (ఆర్​ఐఎస్​ఏటీ-1) మిషన్‌కు ప్రాజెక్ట్​ మేనేజర్‌​గా పనిచేశారు. తమిళనాడు ప్రభుత్వం.. 2015లో ఆమెకు అబ్దుల్​ కలామ్​ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి వలర్మతి కావడం విశేషం. 

ఇది కూడా చదవండి: చాందినీ చౌక్‌ చరిత్ర ఏమిటి?

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)