Breaking News

పీఎస్‌ఎల్‌వీ సీ–62 ప్రయోగంలో విఫలం: ఇస్రో ప్రకటన

Published on Mon, 01/12/2026 - 10:09

సాక్షి, సూళ్లూరుపేట: శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–62 ఉపగ్రహ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో అవాంతరాలు ఎదురయ్యాయి. రాకెట్‌ ‍ప్రయోగం నాలుగో దశలో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయాయి. 18 నిమిషాలకే ప్రయోగం పూర్తి కావాల్సి ఉండగా.. శాటిలైట్‌తో లింగ్‌ తెగిపోయినట్టు ఇస్రో అధికారులు గుర్తించారు. దీంతో, ప్రయోగం విఫలమైనట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ వీ. నారాయణన్‌ మాట్లాడుతూ.. ప్రయోగంలో సాంకేతిక లోపం గుర్తించాం. అన్వేష ప్రయోగంలో అవాంతరాలు ఎదురయ్యాయి. రాకెట్‌ ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. డేటా విశ్లేషిస్తున్నాం. 18 నిమిషాలకే ప్రయోగం పూర్తి కావాల్సింది. కానీ, అలా జరగలేదు. నాలుగో దశ ప్రారంభంలోనే శాటిలైట్‌తో లింక్‌ తెగిపోయింది అని తెలిపారు. లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టి, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. 

 ఇక, ఈ ప్రయోగం ద్వారా 1,485 కిలోల బరువు కలిగిన ఈఓఎస్‌–ఎన్‌1 (అన్వేష) ఉపగ్రహాన్ని, మరో 15 చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైనది. అలాగే, ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగ్రం ఇదే. 

ఈ చిన్న ఉపగ్రహాల్లో మనదేశంలోని మూడు స్టార్టప్‌ కంపెనీలకు చెందిన ఏడు, విదేశాలకు చెందిన ఎనిమిది ఉన్నాయి. వీటిని న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ పర్యవేక్షణలో వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నారు. రాకెట్‌ ప్రయోగించిన తరువాత 17.54 నిమిషాలకు స్పెయిన్‌ దేశానికి చెందిన బుల్లి ఉపగ్రహం మినహా మిగిలిన ఉపగ్రహాలను భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు.

 

 

ఈ దఫా రాకెట్‌లోని నాలుగోదశ (పీఎస్‌–4)తో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత రాకెట్‌లోని నాలుగోదశను క్రమేణ కిందకు దించుతూ రెండుసార్లు రీస్టార్ట్‌ చేస్తారు. ఆ తరువాత స్పెయిన్‌లోని స్పానిష్‌ స్టార్టప్‌ సంస్థకు చెందిన కెస్ట్రెల్‌ ఇనిషియల్‌ టెక్నాలజీ, డిమాన్‌స్ట్రేటర్‌ (కిడ్‌) అనే పేలోడ్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెడతారు. అనంతరం అది భూ వాతావరణంలోకి ప్రవేశించి దక్షిణ ఫసిఫిక్‌ మహాసముద్రంలో పడిపోయే విధంగా ప్రణాళిక రూపొందించారు.  

డీఆర్‌డీవో రూపొందించిన ఈఓఎస్‌–ఎన్‌1  
పీఎస్‌ఎల్‌వీ సీ–62 ద్వారా ప్రయోగించనున్న ఈఓఎస్‌–ఎన్‌1 (అన్వేష్) ఉపగ్రహాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో రూపొందించింది. దీన్ని ప్రధానంగా దేశ రక్షణ కోసం ఉపయోగించనున్నారు.  గూఢచారి ఉపగ్రహాల కుటుంబంలో ఇది అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉపగ్రహం. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు