Breaking News

అమ్ములపొదిలోకి తేజస్‌ 2.0

Published on Wed, 06/11/2025 - 05:00

పాకిస్తాన్‌తో ఉద్రిక్తలు తారస్థాయికి చేరిన వేళ మన వైమానిక పాటవం మరింత బలోపేతం కానుంది. తేలికరకం యుద్ధ విమానం తేజస్‌ తాలూకు అత్యాధునిక ఎంకే1–ఏ వేరియంట్‌ ఈ నెలాఖరుకల్లా ఎయిర్‌ఫోర్స్‌ అమ్ములపొదిలోకి చేరనుంది. దశలవారీగా మొత్తం 83 విమానాలు సమకూరనున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యాధునిక ఏఈఎస్‌ఏ (యాక్టివ్‌ ఎల్రక్టానికలీ స్కాన్డ్‌ అరే) రాడార్లతో వాటిని అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దారు. ఇది ప్రపంచంలోనే అత్యంత మెరుగైన రాడార్‌ వ్యవస్థ.

ఫలితంగా పాశ్చాత్య దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలకు తీసిపోని సామర్థ్యం తేజస్‌ ఎంకే1–ఏ సొంతమైనట్టు జెరూసలేం పోస్ట్‌ వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గతేడాదే అందుబాటులోకి రావాల్సి ఉండగా కీలక విడిభాగాల సరఫరా తదితరాల్లో ఆలస్యం వల్ల జాప్యమైంది. కాలం చెల్లుతున్న మిగ్‌–21, జాగ్వార్‌ యుద్ధ విమానాలను పూర్తిగా తేజస్‌లతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం తొలి తరానికి చెందిన 40 తేజస్‌ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వాయుసేన వద్ద ప్రస్తుతం 31 ఫైటర్‌ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కనీసం 42కు పెంచుకోవాలన్నది లక్ష్యం. ఒక్కో స్క్వాడ్రన్‌లో 16 నుంచి 20 దాకా యుద్ధ విమానాలుంటాయి.  

ఇవీ ప్రత్యేకతలు 
⇒ తేజస్‌ ఎంకే1–ఏలో అమర్చిన అత్యాధునిక ఏఈఎస్‌ఏ రాడార్‌ వ్యవస్థను ఇజ్రాయెల్‌ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎల్టా సిస్టమ్స్‌ సంస్థ అభివృద్ధి చేసింది. 
⇒ తేజస్‌లో అమర్చిన అధునాతన ఎల్రక్టానికల్‌ యుద్ధతంత్ర వ్యవస్థను కూడా ఎల్టాయే సరఫరా చేసింది. 
⇒ ఇజ్రాయెల్‌కే చెందిన ఎల్బిట్‌ సిస్టమ్స్‌ రూపొందించిన అత్యాధునిక హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్‌ప్లే ఘర్షణల వేళ పైలట్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
⇒ ఏఈఎస్‌ఏ వ్యవస్థ తదితరాలన్నింటినీ మేకిన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా  ఇజ్రాయెల్‌ భాగస్వామ్యంతో భారత్‌లోనే తయారు చేశారు. 

⇒ తేజస్‌ ఎంకే1–ఏకు ఇజ్రాయెల్‌ సమకూర్చిన పలు సాంకేతిక హంగులు ఆ దేశానికే చెందిన పలు యుద్ధవిమానాల్లో కూడా లేకపోవడం విశేషం. 
⇒ రఫేల్‌ యుద్ధ విమానాల్లోని రాడార్‌ గైడెడ్‌ డెర్బీ క్షిపణులను తేజస్‌ఎంకే1–ఏకు అమర్చనున్నారు. ఫలితంగా దాని యుద్ధపాటవం ఎన్నో రెట్లు పెరగనుంది. 

⇒ తేజస్‌ తాలూకు భావి వెర్షన్లు మరింత అధునాతనమైన కానార్డ్‌ వింగ్స్, ఎల్రక్టానిక్‌ తదితర వ్యవస్థలు, మరింత మెరుగైన రేంజ్‌ వంటివాటిని సంతరించుకోనున్నట్టు జెరూసలేం పోస్ట్‌ తెలిపింది. 
⇒ తేజస్‌ మూడో వెర్షన్లను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వ రంగ హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నిత్యం శ్రమిస్తోంది.  
⇒ ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థల సరఫరా కాంట్రాక్టుల కోసం ఇజ్రాయెల్‌తో పాటు ఫ్రాన్స్, అమెరికా ఆయుధ కంపెనీలు                      పోటీపడుతున్నాయి. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)