Breaking News

హమాస్ చీఫ్ సిన్వర్‌ మృతిని ధృవీకరించిన ఇజ్రాయెల్

Published on Sun, 06/01/2025 - 09:46

గాజా: గాజాలో మే 13న జరిగిన వైమానిక దాడిలో హమాస్ సీనియర్ నేత మొహమ్మద్ సిన్వర్(Mohammad Sinwar) మృతిచెందాడని ఇజ్రాయెల్‌ ధృవీకరించింది. గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఒక ఆసుపత్రి కింద ఉన్న భూగర్భ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. ఈ దాడుల్లో సిన్వర్‌ మృతిచెందట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) ధృవీకరించాయి.

ఐడీఎఫ్‌  తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్‌ సమన్వయంతో యూరోపియన్ హాస్పిటల్ కింద ఉన్న భూగర్భ హమాస్ కమాండ్, నియంత్రణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. కాగా గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో తన సోదరుడు యాహ్యా సిన్వర్ ,సైనిక కమాండర్ మొహమ్మద్ దీప్‌లు మృతిచెందిన  అనంతరం మహ్మద్ సిన్వర్ హమాస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఇజ్రాయెల్‌పై దాడులకు ప్లాన్ చేయడంలో, వాటిని అమలు చేయడంలో సిన్వర్  కీలక పాత్ర పోషించాడని ఐడీఎఫ్ పేర్కొంది.
 

మే 13న జరిగిన దాడుల్లో హమాస్‌కు చెందిన మరో ఇద్దరు ఉన్నత స్థాయి నేతలు కూడా మృతిచెందారని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ వీరి మృతిని ధృవీకరించినప్పటికీ, హమాస్ ఈ వాదనలను అంగీకరించడం గానీ, తిరస్కరించడం గానీ చేయలేదు. కాగా హమాస్‌ను పూర్తిగా నిర్మూలించే వరకూ వరకు తమ సైనిక కార్యకలాపాలు ఆగవని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: COVID-19: పిల్లలను స్కూళ్లకు పంపొద్దు: కర్నాటక ప్రభుత్వం

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)