Breaking News

కశ్మీర్‌లో ఖమేనీ ఎఫెక్ట్‌.. ఎంపీ, మేయర్‌పై కేసు నమోదు

Published on Wed, 03/04/2026 - 08:18

శ్రీనగర్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. అమెరికా దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ మృతిలో పలు దేశాల్లో ఉన్న షియా ముస్లింలు నిరసనలు చేపట్టారు. ఇదే సమయంలో భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో కూడా షియా ముస్లింలు ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. కాశ్మీర్ లోయలో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో అల్లర్లు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్‌ డివిజన్‌లో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈ వారాంతం వరకు అంటే మార్చి 7వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సకీనా అధికారికంగా ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. దీంతో, వారం పాటు విద్యాసంస్థలు బంద్‌ కానున్నాయి. మరోవైపు.. జమ్ముకశ్మీర్‌లో ఉద్రికత్తల కారణంగా కశ్మీర్‌ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఓ ప్రకటనలో అధికారులు వెల్లడించారు.

ఇక, హింసాత్మక నిరసనలను నివారించడానికి శ్రీనగర్, ఇతర ప్రాంతాలలో ఆంక్షలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు. కశ్మీర్ లోయలో 2G మొబైల్ ఇంటర్నెట్ మాత్రమే అందుబాటులో ఉంది. హోం శాఖ ఆదేశాల ప్రకారం ప్రస్తుతానికి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పరిస్థితుల తీవ్రతను బట్టి వీటిని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు, కల్పిత, తప్పుదారి పట్టించే కంటెంట్‌ను పంచుకున్నారనే ఆరోపణలపై శ్రీనగర్ పోలీసులు నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ, శ్రీనగర్ మాజీ మేయర్ జునైద్ మట్టుపై కేసు నమోదు చేశారు.

లోయలో రాళ్ల వర్షం
ఖమేనీ చనిపోయినట్లు ఆదివారం రోజు ఇరాన్ అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం నాడు నిరసనకారులు, భద్రతా దళాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఐదుగురు పోలీసులు సహా కనీసం 12 మందికి గాయాలు అయ్యాయి. రాళ్లు రువ్వే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు.. టీన్ షీట్లు, ముళ్ల కంచెలతో మూసివేశారు. లోయలో పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)