Breaking News

‘రా’ చీఫ్‌గా పరాగ్‌ జైన్‌

Published on Sat, 06/28/2025 - 15:29

న్యూఢిల్లీ:  పాకిస్తాన్‌ ఉగ్రవాద మూకలపై భారతసైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో కీలక పాత్ర పోషించిన 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌కు ముఖ్యమైన పదవి లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను అత్యున్నత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) నూతన చీఫ్‌గా నియమించింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వు జారీ చేసింది.

 పరాగ్‌ జైన్‌ వచ్చే నెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుత ‘రా’ చీఫ్‌ రవి సిన్హా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. నూతన చీఫ్‌(సెక్రెటరీ)గా పరాగ్‌ జైన్‌ నియామకానికి కేబినెట్‌ అపాయింట్స్‌మెంట్‌ కమిటీ ఇటీవలే ఆమోద ముద్ర వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పరాగ్‌ జైన్‌ ఇప్పటిదాకా ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ చీఫ్‌గా వ్యవహరించారు.  

ప్రతిభావంతుడు పరాగ్‌ జైన్‌  
పంజాబ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన పరాగ్‌ జైన్‌కు ప్రతిభావంతుడిగా పేరుంది. గొప్ప నేరపరి శోధకుడిగా నిఘా వర్గాల్లో గుర్తింపు సాధించారు. మానవ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మిళితం చేసి అనుకున్న ఫలితం సాధించడంలో దిట్ట. దేశంలో పలు కీలక ఆపరేషన్లలో స్వయంగా పాలుపంచుకున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక ఆయనది కీలక భూమిక. పాకిస్తాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను, లాంచ్‌ప్యాడ్‌లను నేలమట్టం చేయడంలో ఆయన హస్తం ఉంది. 

పరాగ్‌ జైన్‌ ఇచ్చిన కచ్చితమైన నిఘా సమాచారంతోనే పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఆయనకు జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది. తన పదవీ కాలంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని అణచివేశారు. 2021 జనవరి 1న పంజాబ్‌లో డీజీపీ ర్యాంక్‌ పొందారు. డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోనే ఎక్కువ కాలం పనిచేశారు. కెనడా, శ్రీలంకలోనూ వివిధ మిషన్లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. కెనడాలో ఉన్నప్పుడు ఖలిస్తాన్‌ ఉగ్రవాద శక్తులపై నిఘా పెట్టి, కీలక సమాచారం సేకరించారు.     
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)