Breaking News

ఐపీఎస్‌ను వీడి ఎమ్మెల్యేగా.. బిహార్‌ లో సూపర్ విక్టరీ

Published on Sun, 11/16/2025 - 13:33

బిహార్ అసెంబ్లీ ఎ‍న్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థిపై 28వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి గెలుపొందారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉన్న ఆనంద్ మిశ్రా ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆనంద్ మిశ్రా తన ఫైర్ బ్రాండ్ ఆపరేషన్స్,  బైక్ రైడ్స్ తో సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ పొందారు.

మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్  మిశ్రా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బక్సర్ నియోజకవర్గం నుంచి 28 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1951లో బక్సర్ నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటివరకూ కాంగ్రెస్ అక్కడ 10 సార్లు విజయం సాధించింది. అటువంటి నియోజకవర్గంలో మెుదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసినప్పటిక తన వ్యూహాలతో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కుమార్ తివారీపై 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2024 జనవరిలో రాజకీయ ప్రవేశం చేసిన ఆనంద్ మిశ్రా తొలుత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరారు. అనంతరం పలు కారణాలతో ఆపార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆనంద్ మిశ్రాకు ఆర్ఎస్ఎస్ నేతలతో మంచి సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన అస్సాంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  

ఆనంద్ మిశ్రా నేపథ్యం

1981 జూన్ 1న బిహార్ రాష్ట్రంలోని బోజ్‌పూర్ లో జన్మించారు. 2011లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అస్సాం క్యాడర్‌ లో విధులు నిర్వహిస్తూ అక్కడ పలు జిల్లాలలు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా సేవలందించారు. అస్సాంలోని లకీంపూర్, దుబ్రీ జిల్లాలలో ఆయన నిర్వహించిన యాంటీ-నార్కోటిక్స్ ఆపరేషన్స్ ఆనంద్ మిశ్రాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. అంతేకాకుండా మేఘాలయ, అస్సాంలలో మిలిటెంట్స్ వ్యతిరేఖ ఆపరేషన్స్ నిర్వహించారు. ఆనంద్ మిశ్రా ప్రత్యేకమైన శైలిలో విధులు నిర్వహిస్తూ జనాలలో మంచి పాపులారిటీ సంపాదించారు.   
 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)