మన రైతులకు కావాలి... రూ. 6.4 లక్షల కోట్లు! 

Published on Mon, 07/07/2025 - 05:35

న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను తట్టుకుని రైతులు అభివృద్ధి చెందాలంటే భారత్‌లో రైతులకు ఏకంగా 75 బిలియన్‌ డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల)పెట్టుబడులు అవసరమని ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌ (ఐఎఫ్‌ఏడీ)అధ్యక్షుడు అల్వారో లారియో అన్నారు. ప్రపంచవ్యాప్తంగానే గాక భారత్‌లోనూ గ్రామీణ సమాజాలకు సాయం అందించడం అతి పెద్ద సవాలని ఆయన తెలిపారు. 

వ్యవసాయాన్ని రైతులకు మరింత లాభదాయకంగా చేయడం, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ఉత్పాదకతను పెంచుకోవడం, ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రతకు ఎదగడం వంటి అంశాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్‌లోని రైతుల్లో చిన్న, సన్నకారు రైతులు 86.2శాతం మంది ఉన్నారు. నీటికొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా కరువులు ఎదుర్కొంటున్నారు.

 కొన్ని వాతావరణ స్మార్ట్‌ పద్ధతులను అవలంబించడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పెట్టుబడులు పెట్టాలి. పంటల వైవిధ్యం, మెరుగైన నీటి నిర్వహణ లేదా సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు, కమ్యూనిటీ విత్తన బ్యాంకులను సృష్టించడం, కరువును తట్టుకునే విత్తనాలను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇవి దిగుబడిని పెంచుతాయి’’ అని లారియో తెలిపారు. ‘‘పేదరైతులకు పెట్టుబడులు, వారికి మార్కెట్‌ అనుసంధానం కీలకం’’ అన్నారు.
 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)