Breaking News

ఇన్‌స్టాంట్‌ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి..

Published on Mon, 05/01/2023 - 18:46

జంతువుల పట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అవి ఎలాంటి హానీ చేయకపోయినా సరే శిక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మనసును కలచివేసేలా ఉంటున్నాయి. అయితే ఇలాగే ఓ మూగజీవాన్ని శిక్షించబోయిన ఆకతాయికి ఊహించని షాక్ తలిగింది.

స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న అతడు.. రోడ్డుపై ఉన్న ఓ గేదెను తన్నాడు. ఆ వెంటనే బైక్‌పై నుంచి జారి కిందపడ్డాడు. బైక్‌ను రైడ్ చేస్తున్న అతని స్నేహితుడు కూడా అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు గాయాలపాలయ్యారు.

అయితే గతంలో ఎప్పుడో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకతాయిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గేదె ఏం చేసిందని తన్నావు.. చూడు ఇప్పుడు నీకు ఏం జరిగిందో.. అందుకే మూగజీవాలకు హాని చేయెద్దు అని హితవు పలికారు.

మరో నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇన్‌స్టాంట్ ఖర్మ అంటే భయ్యా.. తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుంది. క్షణం కూడా ఆలస్యం కాదు.. అంటూ యువకుడ్ని చీవాట్లు పెట్టాడు.
చదవండి: బ్యానెట్‌పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్‌ దారుణం!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)