Breaking News

ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి

Published on Thu, 04/10/2025 - 07:27

దొడ్డబళ్లాపురం: ఆమెకు వివాహం జరిగి 13 ఏళ్లయ్యింది. భర్త, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబం ఏదో సాఫీగా సాగిపోతోంది. అయితే సోషల్‌ మీడియా అనే భూతం జీవితంలో చిచ్చు పెట్టింది. ఇన్‌స్టాలో పరిచయమైన యువకునితో ఆమె వెళ్లిపోవడంతో భర్త లబోదిబోమంటున్నాడు. వారం రోజుల కిందట అతడిని వివాహం చేసుకుని సదరు వీడియో ఇన్‌స్టాలో పోస్టు చేసి భర్తకు షాక్‌ ఇచ్చింది.  

ఇంటి నుంచి వెళ్లిపోయి.. 
అచ్చం సినిమా స్టోరీని తలపించే ఈ సంఘటన బెంగళూరు సమీపంలో నెలమంగల తాలూకా జక్కసంద్రలోని రాఘవేంద్రనగరలో చోటుచేసుకుంది. నేత్రావతి ఈ స్టోరీలో సూత్రధారి. నేత్రావతికి 13 ఏళ్ల క్రితం రమేశ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. నెల క్రితం నేత్రావతి భర్తతో గొడవపడి  ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇటీవల ఆమె సంతోష్‌ అనే యువకున్ని పెళ్లి చేసుకుని వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అది చూసి మొదటిభర్త నెలమంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య  విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుని మోసం చేసిందని, న్యాయం చేయాలని కోరాడు.  

                   గోడు వెళ్లబోసుకుంటున్న రమేశ్, అత్తమామలు  

మోసం చేసింది: అత్తమామలు 
రమేశ్, అతని తల్లిదండ్రులు ఠాణా వద్ద మీడియాతో మాట్లాడారు. కోడలు తమను మోసం చేసిందని, రెండేళ్లుగా ఇన్‌స్టా ప్రియునితో దందా సాగిస్తోందని వారు ఆరోపించారు. తమ మనవన్ని కూడా తీసుకెళ్లిందని, ఆ చిన్నారి ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని వాపోయారు. ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినలేదని అన్నారు. నేత్రావతి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, అనాథ అనే జాలితో పెళ్లి చేసుకుంటే ఇలా చేసిందని రమేశ్‌ వాపోయాడు. తన భార్యకు రూ.50 లక్షల విలువ చేసే పొలం ఉందని, రెండో భర్త దానిపై కన్నేశాడని చెప్పాడు.    

పోలీస్‌స్టేషన్‌కు నేత్రావతి 
ఈ కేసులో ట్విస్టులు ఇంకా ఉన్నాయి. నేత్రావతి, తన లాయరుతో బుధవారం నెలమంగళ ఠాణాకు వచ్చింది. భర్త ఇంటిలో ఉన్న తన వస్తువులను తీసుకెళ్లడానికి పోలీసులు తనకు భద్రత కల్పించాలని కోరింది. మొదటి భర్త రోజూ తాగి వచ్చి కొడతాడని, అతనితో కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. ఇటీవలే అతనిపై కేసు కూడా పెట్టినట్లు తెలిపింది. జిల్లాలో ఇది సంచలనమైంది.  

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)