Breaking News

నిర్బంధాన్ని ఒప్పుకోం 

Published on Sun, 11/02/2025 - 06:32

న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో స్వేచ్ఛాయుత, సమ్మిళిత నౌకాయానం ఉండాలని భారత్‌ కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. ఎలాంటి నిర్బంధ విధానాలు సహించేది లేదని స్పష్టంచేశారు. కౌలాలంపూర్‌లో శనివారం ఆయన ఏషియాన్‌ డిఫెన్స్‌ మినిస్టర్స్‌ మీటింగ్‌ ప్లస్‌ (ఏడీఎంఎం–ప్లస్‌) కాంక్లేవ్‌లో ఆయన ప్రసంగించారు. ‘చట్టంపట్ల భారత్‌ తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తోంది. 

ముఖ్యంగా యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ది లా ఆఫ్‌ సీస్‌ (యూఎన్‌సీఎల్‌ఓఎస్‌)పై భారత్‌కు పూర్తి నమ్మకం ఉంది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం ఉండాలన్న భారత ఆకాంక్ష ఏ దేశానికీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ప్రాంత దేశాల ఉమ్మడి భద్రత, ప్రయోజనాల కోసమే మేం ఈ విధానం అవలంభిస్తున్నాం. 

ఈ ప్రాంతం ఎలాంటి నిర్బంధాలు, బలప్రయోగాలు లేకుండా స్వేచ్ఛాయుతంగా ఉండాలి. భవిష్యత్తులో భద్రత అనేది కేవలం సైనిక సామర్థ్యంపై ఆధారపడి ఉండదు. వనరులు పంచుకోవటంపై, డిజిటల్, భౌతిక మౌలిక వసతులపై, మానవతా సంక్షోభాలను కలిసికట్టుగా ఎదుర్కోవటంపై ఆధారపడి ఉంటుంది’అని పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుగా సైనిక బలప్రయోగానికి పాల్పడుతూ ఆ ప్రాంత దేశాలపై బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

ఏషియాన్‌తో భారత్‌ది ఆర్థిక బంధం కాదు 
ఏషియాన్‌ దేశాలతో భారత్‌కు ఉన్నది ఆర్థిక బంధం మాత్రమే కాదని, అంతకుమించి సైద్ధాంతిక అనుబంధమని రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఏషియాన్‌ నాయకత్వంలో ఈ ప్రాంత సమగ్ర భద్రత కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. పరస్పర ప్రయోజనాలు కాపాడేందుకు ఏషియాన్‌తో భారత్‌ మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఏషియాన్‌ ప్లస్‌ దేశాలతో రక్షణ సహకారాన్ని భారత్‌ ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సామర్థ్య పెంపు కోసమేనని భావిస్తోందని పేర్కొన్నారు. ఈ రక్షణ సహకారాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ‘భద్రత, వృద్ధి, స్వయం సమృద్ధిలో ఈ బలమైన అంతర్గత సంబంధం ఇండియా, ఏషియాన్‌ మధ్య నిజమైన భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది’అని తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)