Breaking News

ఇండిగో : భారీగా పెరిగిన చార్జీలు, కేంద్రం గైడ్‌లైన్స్‌

Published on Sat, 12/06/2025 - 17:39

ఇండిగో వైఫ్యలం, భారీ సంక్షోభంతో ఇతర విమానయాన సంస్థలు తమ ఇష్టారీతిన ధరలను పెంచేశాయి.  అనేక మార్గాల్లో టిక్కెట్ల ధరలు భారీగా పెంచేసిన ప్రయాణీకులను దోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ శనివారం దేశీయ విమాన ఛార్జీలపై పరిమితిని విధించింది. ప్రయాణికులనుంచి ఎటువంటి అదనపు ఫీజుల వసూలు చేయొద్దని,  టికెట్ ధరలు పెంచకుండా పరిమితులు విధిస్తూ విమానయాన సంస్థలకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా, విమానయాన సంస్థలు కొత్తగా నిర్ణయించిన గరిష్ట ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేయరాదని మంత్రిత్వ శాఖ తన ఆదేశంలో పేర్కొంది, కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే వరకు ధరలను స్థిరీకరించడానికి ఈ  ఆదేశాలిచ్చారు.

 

ఈ పరిమితి కింద, అనుమతించబడిన గరిష్ట ఛార్జీలు ఇలా ఉన్నాయి.  

  • 500 కి.మీ వరకు ఉన్న మార్గాలకు రూ. 7,500

  • 500 - 1,000 కి.మీ వరకు ఉన్న మార్గాలకు రూ. 12,000

  • 1,000 నుండి 1,500 కి.మీ వరకు ఉన్న మార్గాలకు రూ. 15,000

  • 1,500 కి.మీ కంటే ఎక్కువ ఉన్న మార్గాలకు రూ. 18,000

ఈ పరిమితికి లోబడే చార్జీలను వసూలు చేయాల్సి ఉంటుంది.  అవకాశవాద ధరలు, అసాధారణంగా పెరిగిన విమాన ఛార్జీలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దేశించిన పరిమితులను మించి వసూలు చేస్తే  కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది.  మరోవైపు మిస్‌ అయిన  లేదా ఆలస్యమైన అన్ని సామాగ్రిని 48 గంటల్లోపు ట్రాక్ చేసి  సంబంధీకులకు తిరిగి ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ఇండిగోకు తేల్చి చెప్పింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు ప్రాసెస్ చేయాలి. ఏదైనా  జాప్యం,లేదా నిర్లక్ష్యం  జరిగినా  నియంత్రణ  చర్యలు తప్పవని పేర్కొంది. 

 ప్రస్తుత ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలకు ప్రయాణానికి దేశీయ విమాన ఛార్జీలను భారీగా పెరిగాయి. ఒక్కె టికెట్‌ పైనా మూడు నాలుగు రెట్లు  ధరలను వసూలు చేస్తున్నాయి. పెరిగాయి. ఉదాహరణకు, ఢిల్లీ నుండి ముంబైకి నాన్-స్టాప్ విమానం ధర రూ. 65,460కి పెరిగింది, అయితే వన్-స్టాప్ విమాన ఎంపికలు రూ. 38,376 నుండి రూ. 48,972 వరకు ఉన్నాయి.  వందలాది విమానాల రద్దు, దేశవ్యాప్తంగా ప్రయాణికుల ఇబ్బందుల తర్వాత కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంది.  మరో మూడు రోజుల్లో  విమానాలు, ప్రయాణాల అంతా సర్దుకుటుందని చెప్పింది. అలాగే   ప్రయాణికులను అన్ని  సౌకర్యాలను  కల్పించాలని,   పిల్లలు, వృద్ధులు, మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇండిగోను ఆదేశించింది.  శుక్రవారం 1,000 కంటే ఎక్కువ విమానాలు రద్దు కాగా,  శనివారం 400 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేసింది ఇండిగో.

 

ఇదీ చదవండి: ఇంటిహెల్పర్‌కి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన నటి
 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)