Breaking News

‘స్వదేశీ’ సత్తా చాటాం: మోదీ

Published on Thu, 06/05/2025 - 05:58

న్యూఢిల్లీ: ‘‘స్వదేశీ ఆయుధాలు ఆపరేషన్‌ సిందూర్‌లో అద్భుతంగా సత్తా చాటాయి. ప్రపంచంలో ఏ దేశానికీ తీసిపోమని నిరూపించుకున్నాయి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత దాడుల్లో కోలుకోలేని నష్టాలు చవిచూసినట్టు పాక్‌ అంగీకరించడమే ఇందుకు తాజా నిదర్శనమన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆయన అధ్యక్షతన సమావేశమైంది. 

మేకిన్‌ ఇండియాలో భాగంగా ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల తయారీకి ప్రభుత్వం ఇస్తున్న అమితమైన ప్రాధాన్యం ఇకముందు కూడా కొనసాగుతుందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పలు మంత్రిత్వ శాఖల పనితీరుపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ జరిగింది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాల్సిందిగా మంత్రివర్గ సహచరులకు మోదీ పిలుపునిచ్చారు. 

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి గద్దెనెక్కి జూన్‌ 9కి ఏడాది పూర్తవుతున్నందున ఈ 12 నెలల్లో సాధించిన ఐదు ప్రధాన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తొలిసారిగా ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గిన ఆర్సీబీ జట్టుకు సన్మానం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి మంత్రివర్గం సంతాపం తెలిపింది.  

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)