Breaking News

విదేశీ విద్య @ రూ. 3,78,400 కోట్లు

Published on Tue, 07/22/2025 - 00:47

భారతీయ కుటుంబాలు తమ పిల్లల విదేశీ విద్య కోసం 2024లో రూ.3,78,400 కోట్లు ఖర్చు చేశాయి. 2030 నాటికి ఇది రెండింతలు దాటి రూ.7,82,600 కోట్లకు చేరుతుందని లండన్ కు చెందిన పేమెంట్స్‌ కంపెనీ వైజ్,  కన్సల్టింగ్‌ సంస్థ ‘రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌’ నివేదిక వెల్లడించింది. భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు, రుసుములు గత ఏడాది రూ.1,700 కోట్లుగా నమోద య్యాయి. ఏటా రూ.30 లక్షలు  పంపే ఒక సాధారణ కుటుంబం ఈ చార్జీల కింద రూ.60,000–75,000 కోల్పోవాల్సి వస్తోంది.

రూ.75 వేల వరకు...
భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు, రుసుములు గత ఏడాది రూ.1,700 కోట్లు నమోదయ్యాయి. ఆరేళ్లలో ఇది రూ.4,300 కోట్లకు చేరవచ్చని అంచనా. ఈ చెల్లింపులలో 95% పైగా సంప్రదాయ బ్యాంకింగ్‌ మార్గాల ద్వారా విదేశాలకు చేరుతున్నాయి. విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపినందుకుగాను బ్యాంకింగ్‌ సంస్థలు విదేశీ మారకపు రేటుపై 3–3.5% చార్జీ వసూలు చేస్తున్నాయి. లావాదేవీ పూర్తి కావడానికి 2–5 రోజుల సమయం పడుతోంది. ఏటా తమ పిల్లల చదువుల కోసం రూ.30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ చార్జీల కింద రూ.60,000–75,000 కోల్పోవాల్సి వస్తోంది. ఈ మొత్తంతో కొన్ని రోజులపాటు విద్యార్థులు రోజువారీ ఖర్చులు వెళ్లదీయవచ్చు. లేదా అదనపు కోర్సులు చేసేందుకు వెచ్చించవచ్చు.

యూఎస్‌లో అనిశ్చితితో..
రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం.. లిబరలైజ్డ్‌ రెమిటెన్ ్స స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద విదేశీ విద్య కోసం భారతీయులు విదేశాలకు పంపిన డబ్బు ఈ ఏప్రిల్‌లో రూ.1,410 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21% తక్కువ. 2025 మొదటి నాలుగు నెలల్లో విదేశీ విద్యకు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద చేసిన ఖర్చు మొత్తంగా 21% తగ్గి రూ.7,516 కోట్లకు చేరుకుంది. గత ఆగస్టు నుంచి ఏప్రిల్‌ వరకు.. తొమ్మిది నెలలుగా ఈ పథకం కింద విదేశాలకు పంపిన డబ్బు తగ్గుతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అమెరికాలో అనిశ్చితి. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రయాణం, విద్య, వైద్య చికిత్స, విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు వంటి లావాదేవీల కోసం రూ.2.15 కోట్ల వరకు విదేశాలకు పంపడానికి ఆర్‌బీఐ అనుమతి ఇస్తోంది.

ప్రపంచ సగటు 6.62%
ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2024 జూలై–సెప్టెంబర్‌లో విదేశాలకు పంపే మొత్తంపై ఈ చార్జీల ప్రపంచ సగటు 6.62% ఉంది. అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి అయ్యే ఖర్చు మధ్యవర్తులు లేదా కరస్పాండెంట్‌ బ్యాంకుల సంఖ్యను బట్టి పెరుగుతుంది. రుసుములు, కార్యాచరణ జాప్యాలు ప్రతి దశలోనూ ఉంటాయి. ఈ ఖర్చులు, జాప్యాల వల్లే కేంద్ర బ్యాంకులు విదేశాలకు నగదు బదిలీ చేయడానికి డిజిటల్‌ కరెన్సీలకు శ్రీకారం చుట్టాయి.

⇒ విదేశాల్లో ఉన్న పిల్లలకు గత ఏడాది విదేశీ విద్యకు అయిన వ్యయంలో నాలుగింట ఒక వంతు.. అంటే రూ.94,600 కోట్లను భారత్‌లోని కుటుంబ సభ్యులు బదిలీ చేశారు. మిగిలిన మొత్తాన్ని పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల ద్వారా సంపాదించిన మొత్తం, అలాగే ఉపకార వేతనాల ద్వారా విద్యార్థులు సమకూర్చుకున్నారు.

⇒ ప్రస్తుతం 18 లక్షల పైచిలుకు భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యనభ్యనిస్తున్నారు. ఏడాది క్రితం ఈ సంఖ్య 13 లక్షలు మాత్రమే.
⇒ విద్యార్థుల ప్రాధాన్యతలో యూఎస్, కెనడా, యూకే టాప్‌–3లో నిలిచాయి.

⇒ వివిధ దేశాల్లో చదువుతున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయుల వాటా 30–35% ఉంది. దశాబ్దం క్రితం ఈ సంఖ్య 11% మాత్రమే.
⇒ విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఆరేళ్లలో 25 లక్షలు దాటొచ్చు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)