Breaking News

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు భారత వ్యోమగామి.. ముహూర్తం ఫిక్స్‌

Published on Fri, 04/18/2025 - 19:26

న్యూఢిల్లీ:  భారత్‌ తన అంతరిక్ష యాత్రలో అరుదైన మైలురాయిని చేరుకోవడానికి మూహూర్తం ఖరారైంది. భారత్ కు చెందిన వ్యోమగామి శుభాన్ష్ శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్((ఐఎస్‌ఎస్‌) లోకి వెళ్లనున్నారు. వచ్చే నెలలో శుభాన్ష్ శుక్లా స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టే విషయాన్ని తాజాగా వెల్లడించారు శాస్త్ర సాంకేతికత మంత్రి డా. జితేందర్ సింగ్. 

‘అంతర్జాతీయ స్పేష్ మిషన్ భారత వ్యోమగామిని తీసుకువెళ్లడానికి మూహూర్తం ఖరారు చేయబడింది . వచ్చే నెలలో  ‘గగన్ యాత్రి’ గ్రూప్ కు కెప్టెన్ గా ఉన్న శుభాన్ష్ శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్నారు.  ఇది భారత అంతరిక్ష యాత్రలో సువర్ణాధ్యాయంగా లిఖించబడుతుంది. ఇస్రో సరికొత్త హద్దులను ఛేదించడానికి ఒక భారతీయ వ్యోమగామి అంతరిక్ష యాత్రకు సిద్ధంగా ఉన్నాడు.మన అంతరిక్ష కలలు మరింత ఎత్తును తాకడానికి ఈ సన్నాహక యాత్ర కచ్చితంగా మైలురాయి కాబోతుంది’ అని జితేందర్ సింగ్ పేర్కొన్నారు.  

యాక్సియోమ్ 4 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన స్పేస్ క్రాఫ్ కు నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విటన్స్ సారథ్యం వహిస్తున్నారు. దీనికి పైలట్ గా శుభాన్ష్ శుక్లా వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు ఉజ్ నాన్ స్కీ(పోలెండ్), టిబోర్ కపూ( హంగేరీ)లు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకుని అక్కడ రెండు వారాల పాటు పరిశోధనలు చేసిన అనంతరం భూమికి తిరిగి వస్తారు. ఈ ప్రయోగంలోభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భాగస్వామిగా ఉంది. 

ఇస్రో వ్యోమగామి శుభాన్ష్ శుక్లా ఐఏఎన్ఎస్ లోకి అడుగుపెడితే అక్కడకు వెళ్లిన తొలి భారతీయుడిగా, రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టిస్తారు. ఇస్రో మావనసహిత అంతరిక్ష మిషన్‌లో భాగంగా గగన్​యాన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్ష్ ఒకరుగా ఉన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)