Breaking News

సరికొత్త రికార్డు సృష్టించిన భారత రైల్వే శాఖ

Published on Wed, 06/02/2021 - 17:57

కరోనా మహమ్మరి కాలంలో భారతీయ రైల్వే మరో రికార్డు సృష్టించింది. మే నెల మొత్తంలో అత్యధికంగా సరుకుల రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2021 మేలో భారత రైల్వే అత్యధికంగా 114.8 మెట్రిక్ టన్నుల(ఎమ్‌టి) సరుకులను రవాణా చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో సుమారు 54.52 మిలియన్ టన్నుల బొగ్గు, 15.12 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 5.36 మిలియన్ టన్నుల సిమెంట్(క్లింకర్ మినహా), 3.68 మిలియన్ టన్నుల ఎరువులు, 3.18 మిలియన్ టన్నుల మినరల్ ఆయిల్ రవాణా చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఫలితంగా గత నెలలో 11,604 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 

మే 2019లో 104.6 టన్నుల సరుకు రవాణా చేసింది. ఇప్పటి వరకు అదే అత్యధికం ఉండేది, ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. 2019 మేతో పోలిస్తే ఇది 9.7 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. భారతీయ రైల్వేకు గత నెలలో ఆదాయం, సరుకు రవాణా ఎక్కువగా ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మే నెలలో వేగన్ టర్న్ అరౌండ్ టైమ్ 26 శాతం మెరుగైందని రైల్వే పేర్కొంది. గత 18 నెలల్లో సరుకు రవాణా రైళ్ల వేగం రెట్టింపు కావడంతో పాటు, రాయితీలు డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల గత నెలలో అత్యధికంగా సరుకు రవాణా చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 2021లో సరుకు రవాణా రైళ్ల సగటు వేగం 45.6 కిలోమీటర్లుగా నమోదైంది, అదే సమయంలో ఇది గత ఏడాది 36.19 కిలోమీటర్ల వేగంతో పోలిస్తే 26 శాతం ఎక్కువ" అని రైల్వే శాఖ వెల్లడించింది.

చదవండి: మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)