Breaking News

పండుగ సీజన్‌లో రైల్వేల బంపర్‌ ఆఫర్‌

Published on Sun, 08/10/2025 - 06:37

సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి, ఛత్‌ పండుగల రద్దీని తగ్గిస్తూ ప్రయాణికులకు సౌలభ్యం కల్పించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ‘రౌండ్‌ ట్రిప్‌ ప్యాకేజ్‌’పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌లో రిటర్న్‌ టికెట్‌ ప్రాథమిక ధరపై 20 శాతం రాయితీ లభిస్తుంది. ఈ మేరకు శనివారం కేంద్ర రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా చేసే బుకింగ్‌లు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర రైల్వేశాఖ ప్రకటించిన రౌండ్‌ ట్రిప్‌ ప్యాకేజ్‌లో భాగంగా వెళ్లే ప్రయాణం అక్టోబర్‌ 13 నుంచి 26 మధ్య, వచ్చే ప్రయాణం నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 1 మధ్య ఉండాలి.

 రిటర్న్‌ టికెట్‌ బుకింగ్‌కు 60 రోజుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పీరియడ్‌ వర్తించదు. రెండు ప్రయాణాలూ ఒకే ప్రయాణికుల పేర్లతో, ఒకే తరగతి, ఒకే గమ్యస్థానం ఉన్న జంటకు మాత్రమే అనుమతిస్తారు. అయితే రెండు ప్రయాణాల్లోనూ కన్‌ఫర్మ్‌డ్‌ టికెట్లు తప్పనిసరి. ఫ్లెక్సీ ఫేర్‌ రైళ్లు మినహా అన్ని సాధారణ, ప్రత్యేక రైళ్లకు రౌండ్‌ ట్రిప్‌ ప్యాకేజ్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ పథకం కింద బుక్‌ చేసిన టికెట్లకు రీఫండ్‌ లేదా మార్పులు అనుమతించరు. ఆన్‌లైన్‌ లేదా కౌంటర్‌.. రెండు టికెట్లు ఒకే విధానంలోనే బుక్‌ చేయాలి. ఈ స్కీమ్‌ పండుగ సీజన్‌లో రద్దీని విభజించడంతో పాటు, ప్రత్యేక రైళ్ల వినియోగాన్ని పెంచుతుందని కేంద్ర రైల్వేశాఖ ఆశిస్తోంది.  

ఆఫర్‌ వివరాలు
→ బుకింగ్‌ ప్రారంభం: ఆగస్టు 14, 2025 
→ ప్రారంభ ప్రయాణం: అక్టోబర్‌ 13 నుంచి 26 వరకు 
→ తిరుగు ప్రయాణం: నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 1 వరకు 
→ రిటర్న్‌ టికెట్‌ బుకింగ్‌కు 60 రోజుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పీరియడ్‌ వర్తించదు. 
→ రానుపోను టికెట్లు ఒకే ప్రయాణికుల పేర్లతో, ఒకే తరగతి, ఒకే గమ్యస్థాన జంటకు మాత్రమే. 
→ రెండు ప్రయాణాలకూ కన్‌ఫర్మ్‌డ్‌ టికెట్లు తప్పనిసరి. 
→ ఫ్లెక్సీ ఫేర్‌ రైళ్లు మినహా అన్ని రైళ్లకు ఆఫర్‌ వర్తింపు. 
→ టికెట్‌ బుక్‌ చేసిన తర్వాత మార్పులు, రీఫండ్‌లు ఉండవు.  

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు