Breaking News

Mahakumbh-2025: నాలుగు నిముషాలకు ఒక రైలు.. మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు

Published on Wed, 01/29/2025 - 06:49

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈరోజు (జనవరి 29) మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో రెండవ అమృత స్నానం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భక్తులు ముందుగానే సంగమస్థలికి చేరుకుంటున్నారు.  

మహా కుంభమేళా పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుండి 190 ప్రత్యేక రైళ్లు, 110 సాధారణ రైళ్లు, 60 మెమూ రైళ్లు సహా 360 రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు.

కుంభమేళాకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల ప్రయాణ అవసరాలను తీర్చడంపై భారత రైల్వేశాఖ దృష్టిసారించిందన్నారు. మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నామని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు.  ప్రతి స్టేషన్‌లో తాగునీరు, ఫుడ్ కోర్టులు,  టాయిలెట్లు  ఏర్పాటు చేశామన్నారు.

అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స బూత్‌లు, వైద్య పరిశీలన గదులను ఏర్పాటు చేశామని, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ ఛోకిలలో యాత్రి సువిధ కేంద్రాల్లో వీల్‌చైర్లు, లగేజ్ ట్రాలీలు మందులు మొదలైనవి  అందిస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)