Breaking News

రెండు నౌకలపై ఇరాన్‌ దాడి

Published on Fri, 03/13/2026 - 04:25

న్యూఢిల్లీ: తమపై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఇరాన్‌ సైతం దీటుగా స్పందిస్తూ అమెరికా తదితర ఇతర దేశాల నౌకలపై దాడులుచేస్తోంది. బుధవారం రాత్రి ఇరాక్‌లోని ఉమ్‌ ఖాసర్‌ నగరంలోని ఖోర్‌ అల్‌ జుబేర్‌ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్‌ ఐలాండ్స్‌ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్‌సీ విష్ణు’పై ఇరాన్‌ దాడిచేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. అతడిని భారతీయునిగా గుర్తించామని ఇరాక్‌లోని భారతీయ రాయబార కార్యాలయం గురువారం తమ సామాజికమాధ్య ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టింది. అతని స్వరాష్ట్రం, కుటుంబం వంటి ఇతర వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు. మంటల్లో చిక్కుకున్న ఆ నౌక నుంచి 27 మంది సిబ్బందిని ఎలాగోలా కాపాడారు.

గాయపడిన వారిని సమీపంలోని బస్రా నగరంలోని ఆస్పత్రిలో చేరి్పంచి వైద్యం అందిస్తున్నారు. నౌకలోని 27 మంది సిబ్బందిలో 15 మంది భారతీయులేనని ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. ఈ నౌకతోపాటు సమీపంలోని మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్‌ నౌక మీదా ఇరాన్‌ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. పేలుడుపదార్థాలతో దూసుకొచ్చి సూసైడ్‌ బోట్‌లు ఢీకొనడంతో పేలుళ్లు జరిగి సేఫ్‌సీ విష్ణు, జిఫిరోస్‌ నౌకలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ రెండు నౌకలు మొత్తంగా 4,00,000 బ్యారెళ్ల ముడిచమురును ఇరాక్‌ నుంచి తీసుకొస్తున్నట్లు షిప్‌ల ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ అయిన ‘ట్యాంకర్‌ట్రాకర్స్‌.కామ్‌’వెల్లడించింది. అమెరికాకు చెందిన సేఫ్‌సీ ట్రాన్స్‌పోర్ట్‌ ఐఎన్‌సీ సంస్థ ‘సేఫ్‌సీ విష్ణు’నౌకను నిర్వహిస్తోంది. 228.6 మీటర్ల పొడవు, 32.57 మీటర్ల వెడల్పయిన సేఫ్‌సీ విష్ణు నౌకను 2007లో తయారుచేశారు. గరిష్టంగా దాదాపు 74,000 టన్నుల బరువైన సరకులను ఇది మోసుకెళ్లగలదు. జిఫిరోస్‌ను గ్రీస్‌కు చెందిన సంస్థ నిర్వహిస్తోంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు