Breaking News

నా హత్యకు కుట్ర: పన్నూ

Published on Fri, 09/20/2024 - 05:45

న్యూఢిల్లీ: తనను హత్య చేయడానికి భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఖలిస్తాన్‌ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ ఇటీవల అమెరికా కోర్టును ఆశ్రయించాడు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు ఫర్‌ సదరన్‌ డి్రస్టిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌లో దావా వేశాడు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. భారత ప్రభుత్వంతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, భారత నిఘా సంస్థ ‘రా’ మాజీ అధినేత సమంత్‌ గోయల్, ఉద్యోగి విక్రమ్‌ యాదవ్, భారత వ్యాపారవేత్త నిఖిల్‌గుప్తాకు తాజాగా సమన్లు జారీ చేసింది.

సమన్లు అందుకున్న వ్యక్తులు 21 రోజుల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 23వ తేదీ దాకా అమెరికాలో పర్యటించనున్నారు. ఇంతలోనే అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గురు పత్వంత్‌సింగ్‌ పన్నూకు కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం ఉంది.  

ఉగ్రవాది వేసిన దావాపై సమన్లా?   
గురు పత్వంత్‌ సింగ్‌ పన్నూ వేసిన దావాపై తమకు అమెరికా కోర్టు సమన్లు జారీ చేయడం పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాది అయిన పన్నూ వేసిన దావాపై భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం పూర్తిగా అసమంజసమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పన్నూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పన్నూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖలిస్తాన్‌ సంస్థపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 కింద నిషేధం అమల్లో ఉందని గుర్తుచేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ సంస్థకు ప్రమేయం ఉందని విక్రమ్‌ మిస్త్రీ వెల్లడించారు.   

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)