Breaking News

మస్క్‌ గ్రోక్‌పై భారత ప్రభుత్వం ‌సీరియస్!‌

Published on Thu, 03/20/2025 - 11:39

న్యూఢిల్లీ: ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. ప్రతిచర్య తీవ్రంగానే ఉంటుంది. మనిషికే కాదు.. మనిషి తెచ్చిన సాంకేతికతకూ అందుకు మినహాయింపు లేకుండా పోయింది. తాజాగా.. ఇలాన్‌ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బో‌ట్‌ గ్రోక్‌(Grok) వ్యవహారం ఇప్పుడు ఇలాగే మారింది. ఎక్స్‌ నుంచి సోషల్‌ మీడియాలో అటు ఇటు తిగిరి.. చివరకు ప్రభుత్వం దృష్టికి చేరింది.  

అన్‌ఫిల్టర్‌ భాష.. సెన్సార్‌లేని పదజాలంతో గ్రోక్‌ యూజర్లకు సమాచారం అందిస్తుండడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో స్క్రూటినీ(పరిశీలన)కి దిగింది. రెచ్చగొట్టే తరహా సమాచారాన్ని గ్రోక్‌ యూజర్లకు ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్‌ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ  ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపర్చడంపై ఆరా తీసింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని అవతలి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

ఇలాన్‌ మస్క్‌(Elon Musk)కు చెందిన ఏఐ స్టార్టప్‌ ఎక్స్‌ఏఐ గ్రోక్‌ చాట్‌బాట్‌ సేవల్ని అందిస్తోంది. అయితే భారతీయ కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్‌  హిందీ యాసలో సమాధానాలు ఇస్తోంది. అలాగే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. చాట్‌జీపీటీ సహా చాలావరకు ఏఐ చాట్‌బాట్‌లు వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. అలాగే.. భాష విషయంలోనూ సెన్సార్డ్‌గా ఉంటున్నాయి. కానీ, గ్రోక్‌ అందుకు విరుద్ధంగా ఉండడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. 

ఏఐ రీసెర్చర్‌ రిలే గూడ్‌సైడ్‌(Riley Goodside)కు గ్రోక్‌తో ఎదురైన చేదు అనుభవం ఆ మధ్య వైరల్‌ అయ్యింది. పదే పదే ఆయన గ్రోక్‌ను వాయిస్‌ మోడ్‌లో ప్రశ్నలతో విసిగించారు. దీంతో అది ఓపిక నశించి.. మనిషి తరహాలోనే అరుస్తూ ఆయన్ని బూతులు తిట్టి.. ఆ సంభాషణను అక్కడితోనే ముగించింది. 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు